Balakrishna And Anasuya Squid Game: కరోనా లాక్ డౌన్ సమయం లో మన ఆడియన్స్ ఓటీటీ లో ఎగబడి చూసిన వెబ్ సిరీస్ లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్స్'(Squid Games). రీసెంట్ గానే చివరి సీజన్ కూడా ప్రసరమై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. జీవితం లో ఎన్నో కష్టాలను ఎదురుకునే పేదవాళ్ళు , కోటీశ్వరులు అవ్వాలనే తపనతో, తమ కష్టాలన్నీ తీర్చుకోవాలనే ఆశతో ఈ గేమ్స్ ఆడేందుకు వస్తారు. అయితే ఈ గేమ్స్ లో ఓడిపోయిన వాళ్ళు చనిపోతారు అనే విషయం మాత్రం తెలియదు. అది తెలియకుండా వచ్చి, గేమ్స్ ఆడి, అందరూ చనిపోతూ ఉంటారు. ఈ గేమ్స్ ని ఎలా అయినా ఆపాలి అని రెండవ సారి గేమ్స్ ఆడేందుకు వచ్చిన హీరో కూడా, ఈ ప్రయత్నం లో విఫలమై హీరో కూడా చివర్లో ప్రాణాలను వదిలేస్తాడు. అలా ముగుసుతుంది ఈ వెబ్ సిరీస్.
Also Read: ’అఖండ 2′ టీం కి చురకలు అంటించిన ‘ఓజీ’ నిర్మాత..ఇలా అయితే కష్టమే
అయితే ఈ వెబ్ సిరీస్ లో మన తెలుగు హీరోలు, అది కూడా బాలయ్య(Nandamuri Balakrishna) నటిస్తే ఎలా ఉంటుంది?, ఆ ఊహనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదూ. అయితే ప్రస్తుత కాలం లో మన నెటిజెన్స్ ఊహించుకోవడం తో ఆపేయడం లేదు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. దానిని ఉపయోగించి ఇష్టమొచ్చినట్టు ఎడిటింగ్స్ చేసేస్తున్నారు. ఒక నెటిజెన్ బాలయ్య ని ప్లేయర్ నెంబర్ 456 గా పెట్టి, మిగిలిన ప్లేయర్స్ గా రాజీవ్ కనకాల(Rajeev Kanakala), అనసూయ(Anchor Anasuya) వంటి వారితో కలిసి ఆయన స్క్విడ్ గేమ్ ఆడుతున్నట్టు ఒక ఎడిట్ చేశారు. దీనికి నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏమి క్రియేటివిటీ రా బాబు, మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, సినీ ఇండస్ట్రీ లో ఉండాల్సిన వాళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయిన ఈ ఎడిటింగ్ వీడియో ని మీరు కూడా చూసేయండి.
— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025