Hari Hara Veeramallu Pre Release Event Criticism: సినిమా ఈవెంట్స్ లో సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి, రాజకీయ ఈవెంట్స్ లో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాలి, ఆ మాత్రం క్లారిటీ లేకపోతే చూసే జనాలకు అసలు ఇది సినిమా ఈవెంటా?, లేకపోతే రాజకీయ ఈవెంటా? అనేది అర్థం కానీ పరిస్థితి ఏర్పడుతుంది. ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అలాగే ఉంటున్నాయి. గతం లో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు, కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరయ్యారు. వస్తే వచ్చారు, కానీ కమెడియన్ పృథ్వీ లాంటి వాళ్ళు రాజకీయ పరంగా విపక్ష పార్టీ ని విమర్శించి ‘గేమ్ చేంజర్’ చిత్రం పై తీవ్రమైన నెగటివిటీ ని ఏర్పడేలా చేశారు. ఈ నెగటివిటీ సినిమా థియేట్రికల్ రన్ పై పూర్తి స్థాయిలో పడిందని చెప్పడం కరెక్ట్ కాదు కానీ, కొంతమేరకు పడింది అనే చెప్పాలి.
Also Read: బాలయ్య-అనసూయ ‘స్క్విడ్ గేమ్’ ఆడితే..!
పోనే ఇప్పటికైనా మారినారా అంటే అది కూడా లేదు. మరో వారం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్ప కళావేదిక లో ఈ నెల 21 న గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నట్టు మేకర్స్ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కొంతమంది మంత్రులు, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మరికొంతమంది మంత్రులు, అదే విధంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన మంత్రులు హాజరు కాబోతున్నారట. దీనిని చూసి ఫ్యాన్స్ ‘అన్నయ్యా..అసలు ఇది సినిమా ఈవెంటా?, రాజకీయ సభనా?, వదిలితే 2029 మ్యానిఫెస్టో ని కూడా విడుదల చేసేలా ఉన్నావే?, ఏంటి అన్నయ్య ఇది’ అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు.
పోనీ రాజకీయనాయకులను పిలిచారు సరే సరి, మళ్ళీ సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఎక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో, సినిమా మీద లేని పోనీ నెగటివిటీ ని ఎక్కడ తెచ్చిపెడుతాడో అని అభిమానులు గుండెని అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా సనాతన ధర్మం కాన్సెప్ట్ మీద తెరకెక్కినది కాబట్టి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ నేపథ్యం కాస్త తక్కువగానే ఉంటుంది కానీ, సెకండ్ హాఫ్ లో గట్టిగానే ఉంటుందట. కానీ ఇవి కావాలని ఉద్దేశ్యపూర్వకంగా రుద్దే కార్యక్రమంగా పెట్టిన సన్నివేశాలు కాదు, ఔరంగజేబు కాలం లో సనాతన ధర్మం పై ఎన్నో అరాచకాలు జరిగాయి అనేది వాస్తవం. అందుకే ఈ సినిమాలో వాటిని చూపించారట. అవి ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగానే తీసారని సెన్సార్ నుండి వస్తున్న టాక్.