Hari Hara Veeramallu Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు చాలా కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విషయం లో నిజంగా పవన్ అభిమానుల సహనానికి సెల్యూట్ చేయొచ్చు. ఈ ఏడాది లోనే మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేశారు. జూన్ 12 న అయితే మరో పది రోజుల్లో సినిమా విడుదల అవుతుంది అనగా, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన తర్వాత వాయిదా వేశారు. ఆ దెబ్బకి ఈ చిత్రం మరో వారం లో విడుదల అవుతుంది అంటే ఓవర్సీస్ లో ఒక్కరు కూడా నమ్మడం లేదు. ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ పై తీవ్రమైన ప్రభావం పడింది. నార్త్ అమెరికా నుండి, ఆస్ట్రేలియా వరకు ఎక్కడా కూడా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు.
Also Read: ’అఖండ 2′ టీం కి చురకలు అంటించిన ‘ఓజీ’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
ముందు కంటెంట్ మాకు చేరిన తర్వాతనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెడుతామని అక్కడి బయ్యర్స్ బలమైన డిమాండ్ ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21 న నిర్వహించబోతున్నాము అని కాసేపటి క్రితమే అదిరిపోయే రేంజ్ పోస్టర్ తో మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు కానీ, మేకర్స్ ని ఇప్పటికీ తప్పుబడుతూనే ఉన్నారు. ఎవరైనా ఆదివారం రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారు కానీ, మీరేంట్రా పనిదినాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టారు. వైజాగ్ లో ఈ నెల 20 న ఈవెంట్ ని నిర్వహిస్తామని చెప్పారు, ఏమైంది దాని సంగతి?, కాసేపు తిరుపతి అంటారు,కాసేపు వైజాగ్ అంటారు, కాసేపు హైదరాబాద్ అంటారు, అసలు మీ స్కీం ఏంటి అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ ఎట్టకేలకు ఎదో ఒక చోట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు,సంతోషం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతాడు అనే దానిపై సోషల్ మీడియా లో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయి. రీసెంట్ గా సినీ ఇండస్ట్రీ లో ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. ఆ నలుగురు అంటూ కొంతమంది థియేటర్స్ ని మూసి వేసే ఆలోచన చేయడం,అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్లి ఆయన ఫైర్ అవ్వడం వంటివి మనం చూసాము. దీని గురించి మళ్ళీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతాడా ? లేదా? అని ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓవర్సీస్ బయ్యర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ తర్వాత సినిమా కచ్చితంగా 24 న విడుదల అవుతుంది అనే నమ్మకం వస్తుందని, టికెట్స్ అమ్మకాల సంఖ్య బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.