OG producer fires on Akhanda 2 team: ప్రస్తుతం టాలీవుడ్ లో ‘అఖండ 2′(Akhanda 2 Movie) టీంకి, ఓజీ టీం కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 25 న విడుదల అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ముందుగా అయితే అఖండ 2 టీం ఈ తేదీన మా చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన చేశారు. కానీ ‘ఓజీ'(They Call Him OG) మూవీ టీం కూడా అదే తేదీని లాక్ చేసుకోవడం తో ఇరు టీమ్స్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. అయితే అఖండ 2 టీం ని సంప్రదించిన తర్వాతే,తాము విడుదల తేదీని లాక్ చేసుకున్నామని, ఓజీ టీం చెప్తున్న మాట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ , ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్ ఇదే. అఖండ 2 చిత్రానికి VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని, అది పూర్తి అవ్వడానికి,మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడానికి బాగా సమయం పడుతుందని, అందుకే డిసెంబర్ కి ఈ చిత్రాన్ని లాక్ చేశారని టాక్.
నిన్న ఈ సినిమా వాయిదా పడినట్టు బలంగా వార్తలు వినిపించాయి. డిసెంబర్ మొదటి వారం లో విడుదల అవ్వబోతుందని, ఒకేసారి సోషల్ మీడియా పేజీలన్నీ ప్రచురించాయి. దీంతో అలెర్ట్ అయిన అఖండ 2 టీం, చెప్పిన డేట్ కి సినిమాని విడుదల చేస్తున్నామని మరోసారి తన పీఆర్ పేజీలతో ట్వీట్లు వేయించింది. ఇలా చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓటీటీ డీల్ ని లాక్ చేయడం కోసమే, నిర్మాతలు ఈ ట్రిక్ ని ప్లే చేస్తున్నారని,అంతే కాకుండా సినిమా వాయిదా పడింది అని తెలిస్తే బయ్యర్స్ నుండి రావాల్సిన అడ్వాన్సులు ఆగిపోతాయని,అందుకే నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం ని సోషల్ మీడియా లో తన పీఆర్ చానెల్స్ తో ప్రచారం చేయిస్తుందని అంటున్నారు.
Also Read: Hari Hara Veeramallu Shocking Truth: షాకింగ్ నిజం: హరిహర వీరమల్లు.. ఒరిజినల్ స్టోరీ కాదా?
అయితే కాసేపటి క్రితమే ఓజీ నిర్మాత డీవీవీ దానయ్య తిరుమల శ్రీవారి దర్శనం ని ముగించుకొని, మీడియా తో మాట్లాడుతూ ‘మరో వారం లో మా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారి హరి హర వీరమల్లు చిత్రం విడుదల అవుతుంది. ఆ సినిమా హిట్ అవ్వాలని దేవుడిని మొక్కుకున్నాను. అదే విధంగా సెప్టెంబర్ 25 న మా ఓజీ చిత్రం కూడా విడుదల అవుతుంది. ఆ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరోసారి మేము చెప్పిన డేట్ లోనే వస్తున్నామని ఆయన ఖరారు చేసాడు. ప్రాక్టికల్ గా కూడా చూస్తే ఓజీ బిజినెస్ థియేట్రికల్ పరంగా, నాన్ థియేట్రికల్ పరంగా ఆల్ టైం రికార్డు ప్రైజ్ కి బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అఖండ 2 కి ఇంకా ఓటీటీ రైట్స్ కూడా క్లోజ్ అవ్వలేదు. అందుకే ఈ సినిమా రావట్లేదని అందరికీ అర్థం అయిపోయింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.