Chhaava Movie: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది ‘చావా'(Chhaava Movie) సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం మూడు వారాల్లో 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రీసెంట్ గానే తెలుగు లో కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్(Vicky Kaushal) కి ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. ఆయన స్టార్ స్టేటస్ పెరగడం మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ నటుల జాబితాలో ఒకరిగా చేరిపోయాడు. ఈ సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ చిత్రం లో విక్కీ కౌశల్ ఎంత అద్భుతంగా నటించాడో, ఔరంగజేబు క్యారెక్టర్ చేసిన అక్షయ్ ఖన్నా(Akshay Khanna) కూడా అంతే అద్భుతంగా నటించాడు.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
ఇతని క్యారెక్టర్ లోని క్రూరత్వాన్ని చూసి కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు స్క్రీన్స్ ని కూడా చింపేసిన సందర్భాలు ఉన్నాయి. అంత కోపం వచ్చేలా విలనిజాన్ని పండించాడు ఆయన. అయితే ఈ క్యారెక్టర్ ని ముందుగా రానా దగ్గుబాటి(Rana Daggubati) ని చేయాలని రిక్వెస్ట్ చేశారట మేకర్స్. కానీ రానా అలాంటి రోల్స్ ఇక నుండి చేయదల్చుకోలేదు, సోలో హీరో గా కెరీర్ ని కొనసాగించాలని అనుకుంటున్నాను అని చెప్పాడట. దీంతో ఆ క్యారెక్టర్ కోసం బాబీ డియోల్(Bobby Deol) ని సంప్రదించారట. కానీ బాబీ డియోల్ ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో ఔరంగజేబు క్యారక్టర్ చేస్తున్నాడు. మళ్ళీ అదే క్యారెక్టర్ చేయడానికి ఆయన ఆసక్తి చూపించకపోవడం తో, మేకర్స్ ఇక చివరికి అక్షయ్ ఖన్నా ని సంప్రదించారు. లుక్ టెస్ట్ లోనే అక్షయ్ ఖన్నా డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడట. చాలా కాలం తర్వాత ఆయనకు ఒక బలమైన క్యారెక్టర్ రావడంతో, ముందు వెనుక కూడా ఆలోచించకుండా ఈ సినిమాని ఒప్పుకొని చేశాడట.
అయితే ఒకవేళ ఈ క్యారక్టర్ ని రానా దగ్గుబాటి ఒప్పుకొని చేసుంటే, తెలుగు వెర్షన్ కి ఇంకా ఎక్కువ మైలేజ్ వచ్చేదని, క్యారెక్టర్ లో క్రూరత్వం ఇంకా గట్టిగా పండేది అని విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి తెలుగు లో కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లు వస్తున్నాయి. మొదటి రెండు రోజుల్లో 6 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు కూడా భారీ వసూళ్లను అందుకుంటుందని, మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సోమవారం నుండి కాస్త డీసెంట్ స్థాయి లో వసూళ్లను హోల్డ్ చేయగలిగితే, ఈ సినిమాకి తెలుగు వెర్షన్ నుండే 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు, చూడాలి మరి.