Megastar Chiranjeevi: కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) ఎప్పుడూ ముందు ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ ఆర్టిస్టులంటే ఆయనకు ఎంతో ఇష్టం. సందర్భం దొరికినప్పుడల్లా వాళ్ళను సత్కరిస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Srileela) ని ప్రత్యేకంగా సత్కరించాడు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆమె మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie) సెట్స్ కి విచ్చేసింది. నిన్న మహిళా దినోత్సవం కాబట్టి శ్రీలీల ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించి ఆమెకు వెండి వర్ణం లో ఉన్న శంఖాన్ని ప్రత్యేక కానుకగా అందించాడు. దానికి సంబంధించిన ఫోటోని శ్రీలీల తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీ కి ఓజీ..వెండితెర పై మనం ఎంతగానో ఆదరించే శంకర్ దాదా ఎంబీబీఎస్. మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ప్రత్యేక కానుక అందించారు. మీరు నాపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు సార్. ఎంతో రుచికరమైన భోజనాన్ని మాకోసం ఏర్పాటు చేసినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఆమె ఒక స్టోరీ ని అప్లోడ్ చేసింది. దీనిని మెగా అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి బాగా వైరల్ చేసారు. ఇది ఇలా ఉండగా శ్రీలీల కి ‘విశ్వంభర’ సెట్స్ లో ఏమి పని?, ఆమె ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్, లేదా స్పెషల్ క్యారక్టర్ ఏమైనా చేస్తుందా?, అనే అనుమానాలను వ్యక్తం చేసారు అభిమానులు. అయితే అలాంటిది ఏమి లేదని, కేవలం ఆమె చిరంజీవి గారిని కలిసి వెళ్లేందుకు వచ్చిందని ‘విశ్వంభర’ మూవీ కి సంబంధించిన సోషల్ మీడియా వారు చెప్పుకొచ్చారు.
ఇక ‘విశ్వంభర’ సినిమా విషయానికి వస్తే, సంక్రాంతికి కానుకగా జనవరి 10 న ఈ సినిమా విడుదల అవ్వాలి. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేశారు. కానీ టీజర్ లో VFX ని చూసి అభిమానులు చాలా తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంత నాసిరకమైన గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందని అసలు ఊహించలేదు అంటూ డైరెక్టర్ ని ట్యాగ్ చేసి అభిమానులు బూతులు తిట్టసాగారు. ఇక ఇతర హీరోల అభిమానుల నుండి ఈ సినిమాకి ఏ రేంజ్ ట్రోల్స్ పడ్డాయో మనమంతా చూసాము. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఉన్న హైప్, ఆ ఒక్క టీజర్ తో చెడిపోయింది. ఇప్పుడు గ్రాఫిక్స్ మీద మూవీ టీం మళ్ళీ రీ వర్క్ చేస్తుంది. ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడం తో, ఈ సమ్మర్ కి ఈ చిత్రం విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.