Mazaka Closing Collections
Mazaka Closing Collections: యంగ్ హీరోలలో అత్యంత దురదృష్టకరమైన జాతకం ఎవరికైనా ఉందా అంటే అది సందీప్ కిషన్(Sundeep Kishan) కి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరో అయ్యేందుకు ఇతనికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అందం, టాలెంట్,కటౌట్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఆయన తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయాడు. కెరీర్ మొత్తం మీద 30 సినిమాలు చేసాడు. అందులో ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ అనే సినిమా తప్ప, మరో సినిమా క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోలేకపోయింది. దీనిని బట్టి ఆయన దురదృష్టం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది విడుదలైన ‘భైరవ కోన’ చిత్రానికి మంచి టాక్ వచ్చింది కానీ, కమర్షియల్ గా అబోవ్ యావరేజ్ గానే నిల్చింది. రీసెంట్ గా ఆయన చేసిన ‘మజాకా'(Majaka Movie) చిత్రంతో అయినా తన సత్తా చాటుకుంటాడు అనుకుంటే, ఈ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read: షూటింగ్ దశలోనే ఉన్నప్పుడే 80 కోట్లు..సరికొత్త చరిత్ర సృష్టించిన బాలయ్య ‘అఖండ 2’ !
విడుదలకు ముందు ప్రొమోషన్స్ ని చూసి కచ్చితంగా ఈ సినిమా అతని కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు. కానీ మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి క్లోజింగ్ లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగితే, క్లోజింగ్ లో కేవలం కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా సీడెడ్ లో కోటి 80 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి, క్లోజింగ్ లో కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే, కేవలం రెండు కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది.
అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి కోటిన్నర రూపాయిల బిజినెస్ జరిగితే క్లోజింగ్ లో కేవలం 90 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 5 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి అన్నమాట. జరిగిన బిజినెస్ లో 50 శాతం కూడా రికవరీ చేయలేక చతికల పడింది ఈ చిత్రం. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం, ట్రైలర్ బాగాలేకపోవడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు.