Balakrishna Akhanda: నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి థియేటర్స్ లో దుమ్ము లేపుతుంది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గలేదు. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. అయితే, అఖండ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

కాగా హాట్ స్టార్ ఓటీటీలో కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అఖండ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. ఓటీటీల్లో వచ్చిన తెలుగు సినిమాల్లో 24 గంటల్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ రికార్డు పై బాలయ్య అభిమానులు ఫుల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ సాధించలేని రికార్డును బాలయ్య సాధించాడు.
Also Read: బాలయ్య భార్య వసుంధర ఎవరి కూతురు.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే?
కాగా ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుని రూ.200 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమాతో, నటసింహం బాలయ్య సత్తా ఏమిటో బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన స్టామినా ఏమిటో మరోసారి ఘనంగా చాటినట్టు అయింది. ఏది ఏమైనా అఖండ అనే బలమైన పాత్రతో ముఖ్యంగా బాలయ్య బాబు చేత ఆయన వయసుకు తగ్గట్టు.. ఆయన ఆహర్యానికి తగ్గ సినిమా తీసి హిట్ కొట్టిన బోయపాటిని ముందు అభినందించాలి.
ఇక అఘోరాగా బాలయ్యకి మేకప్ బాగా సూట్ అయింది. ముఖ్యంగా హైందవం – దేవాలయం – సన్యాసం – శివుని తత్వం వెరసి చిన్న ఆధ్యాత్మికత భావనను కలిగించారు. సినిమాలో అందరికీ బాగా కనెక్ట్ అయింది సాధువు ధర్మం, అఘోరాల కర్తవ్యమే. కళ్ళు మూసి తపస్సు చేయడం కాదు – దేవాలయాలు – దేవుడు జోలికి వస్తే తొక్క తీస్తాం అనేలా ఉంది బాలయ్య నటన.
Also Read: అఖండ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య !