ఆర్‌ఈసీ పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లకు తీపికబురు అందించింది. మొత్తం 12 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్-ఎలక్ట్రికల్, సివిల్) ఉద్యోగ ఖాళీలతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్) ఉద్యోగ ఖాళీలు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్-ఎలక్ట్రికల్, సివిల్) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంబీఏ(హెచ్.ఆర్) పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు 85,000 రూపాయలు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వాళ్లకు నెలకు 1,12,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
అకడమిక్, పని అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2022 సంవత్సరం జనవరి 22వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరగనుంది.