
NBK Unstoppable With Mahesh: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టాడు. బాలయ్య పేస్ బుక్ లో కామెంట్ పెడుతూ.. ‘అద్భుతమైన నటుడు.. అంతకన్న అద్భుతమైన మనసు ఉన్న మనిషి మన సూపర్ స్టార్ మహేష్’ అని బాలయ్య పోస్ట్ చేసాడు.

బాలయ్య కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తున్నాయి. ఇక ఇప్పటికే 9 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మొత్తానికి గ్రాండ్ ఫినాలేకి రెడీ అయింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ప్రోమోలో చాలా అంశాలే హైలైట్ అయ్యాయి. మెయిన్ గా మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా బాగా పేలాయి. అలాగే ఎమోషనల్ గా ప్రతి ఒక్కరినీ కదిలించింది కూడా. అన్‌స్టాపబుబ్ సీజన్ ముగింపు వేడుకగా ఈ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 4న ప్రసారం చేయనున్నారు.
Also Read: బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు !

కాగా బాలయ్య- మహేష్ కాంబోను చూసేందుకు రెండు కళ్లు చాలవని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమోలో మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడని బాలయ్య చెప్పాడు. ఇక ఆ అంశం పై ప్రోమోలో మహేష్ చెప్పిన మాటలు ఎమోషనల్ గా ఉన్నాయి. ఈ క్రమంలో తన కుమారుడు గౌతమ్ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు.