
Director Venu: ఒక్క సినిమాతో వేణు ఎల్దండి టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించాడు. బలగం ఆయనకు ఎక్కడ లేని పేరు, గౌరవం తెచ్చిపెట్టాయి. బలగం మూవీ చూసిన ప్రతి ఒక్కరి నోట అద్భుతం అనే మాట వినిపిస్తోంది. ఒక జబర్దస్త్ కమెడియన్ లో ఇంత టాలెంట్ ఉందా! అని ఆశ్చర్యపోతున్నారు. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు తమ పల్లెటూళ్లను, అయినవారిని బలగం మూవీ గుర్తు చేసిందంటున్నారు. మనస్ఫూర్తిగా ఏడ్చుకున్నామని సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతున్నారు. ప్రేక్షకులను అంతగా కదిలించిన చిత్రం ఈ మధ్య కాలంలో బహుశా రాలేదని చెప్పొచ్చు.
ఒక మనిషి చావు చుట్టూ అల్లిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా హృదయాలను తాకింది. కాగా బలగం మూవీ ఎంత పెద్ద సక్సెస్ అంటే… రూ. 22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బలగం మూవీలో ప్రియదర్శి మాత్రమే తెలిసిన ముఖం. దిల్ రాజు నిర్మాత అన్న పేరు తప్పితే… స్టార్ అట్రాక్షన్ లేదు. కేవలం కంటెంట్ ఆధారంగా ప్రభంజనం సృష్టించిన చిత్రం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎర్లీగా ఓటీటీలో వదలాల్సి వచ్చింది. లేదంటే థియేటర్స్ లో ఇంకా దుమ్ముదులిపేది. జనాల్లోకి వెళుతున్న సమయంలో ఓటీటీలో ప్రత్యక్షమైంది.
ఓటీటీలో బలగం చిత్రానికి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. అదే సమయంలో థియేటర్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్నట్లు సమాచారం. బలగం గొప్ప విజయం సాధించగా… డైరెక్టర్ వేణు ఎల్దండి మొక్కు తీర్చుకున్నాడు. వేణు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తన పూజా కార్యక్రమం ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేశారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో బలగం మూవీ మొదలుపెట్టాను. అంజన్న దయతో బలగం మీ అందరినీ మెప్పించింది. అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది… అంటూ కామెంట్ చేశారు. తన పిల్లలతో వేణు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బలగం సక్సెస్ నేపథ్యంలో దిల్ రాజు ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వేణు తెరకెక్కించే నెక్స్ట్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం…
కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది ..🙏#balagam #kondagattu #hanuman #venuyeldandi #venutillu #devotional @dilrajuprodctns pic.twitter.com/FDGUsw06jn
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) March 29, 2023