
Dasara Movie Nani Friend: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన న్యాచురల్ స్టార్ నాని ‘దసరా’ మూవీ కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుండడమే. ఈ సినిమా పై నాని భారీ అసలే పెట్టుకున్నాడు.ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా సుమారుగా 50 కోట్ల రూపాయలకు జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇక టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్, వస్తే వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది ఈ సినిమా. ఇది ఇలా ఉండగా ఈ సినిమా నాని తో పాటుగా దీక్షిత్ శెట్టి అనే హీరో కూడా నటించాడు.ఇందులో నాని కి ప్రాణ స్నేహితుడిగా ఆయన కనిపించబోతున్నాడు. కథలో హీరో తో సమానమైన పాత్ర కావడం తో ప్రొమోషన్స్ లో నాని తో పాటుగా ఇతను కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు.
అయితే ఇతను ఎవరో టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా తెలియదు.ఎందుకంటే వాళ్లకి పెద్దగా ముఖ పరిచయం లేని సెలబ్రిటీ. కానీ ఇతను ఈ సినిమాలోకి రాకముందే కన్నడ లో టీవీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. అంతే కాకుండా యూట్యూబ్ లో కన్నడ భాషలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజెన్స్ కి కూడా సుపరిచితమే. చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఇతను ఈ సినిమా ద్వారా కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాటుకుపోతాడు అని అనిపిస్తుంది.

గతం లో నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించిన తర్వాత ఆయనకీ హీరో పాత్రలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఏ స్థానం లో ఉన్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీక్షిత్ శెట్టి కూడా అదే రేంజ్ లో క్లిక్ అవుతాడని విశ్లేషకులు చెప్తున్నారు.