Balagam Director Venu: దర్శకుడు వేణు ఎల్దండి రెండోసారి తండ్రి అయ్యాడు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. వేణు కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టాడు. ప్రభాస్ మున్నాతో పాటు పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేశాడు. అనంతరం అతడు జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. 2013లో జబర్దస్త్ ఈటీవీలో ప్రయోగాత్మకంగా మొదలైంది. వేణు వండర్స్ పేరుతో ఆయన టీమ్ లీడర్ గా కామెడీ పంచాడు. చాలా కాలం జబర్దస్త్ లో ఆయన కామెడీ స్కిట్స్ చేశాడు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి స్టార్స్ వేణు టీమ్ లో కమెడియన్గా చేశారు.
అయితే కొన్నాళ్లకు వేణు జబర్దస్త్ వదిలేశాడు. సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగా ప్రయత్నాలు చేశాడు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాతగా మారి చేసిన చిత్రం బలగం. వేణు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బలగం తెరకెక్కించాడు. ఈ ఏడాది విడుదలైన బలగం సంచలన విజయం సాధించింది. చిన్న చిన్న కారణాలతో విడిపోయిన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి కలిసిపోయారు.
తెలంగాణా పల్లెల్లో బలగం మూవీ బహిరంగ ప్రదర్శనలు జరిగాయి. అంతర్జాతీయంగా బలగం అనేక అవార్డులు కొల్లగొట్టింది. ఒక్క సినిమాతో వేణు పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. ఇటీవల ఆస్కార్ ఎంట్రీ కోసం ప్రయత్నం చేశారు. అయితే మరో సినిమాకు ఆ ఛాన్స్ దక్కింది. బలగం మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్స్ గా నటించారు.
దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వేణు తెరకెక్కించే ఈ చిత్రంలో ప్రియదర్శి మరలా హీరోగా నటిస్తున్నాడట. బలగం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వేణు ఇంట్లో పండగ చోటు చేసుకుంది. వేణు రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది. వేణుకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు. రెండో సంతానంగా అమ్మాయి పుట్టింది. అభిమానులు వేణుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు…
Blessed with a baby girl. It gives me immense pleasure to share this good news with my extended family… pic.twitter.com/86ABzTkpzI
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) October 20, 2023