https://oktelugu.com/

Baby – Adipurush  Collections : ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ ని దాటేసిన ‘బేబీ’..ఇది కదా మాస్ అంటే!

బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ప్రభాస్ 'ఆదిపురుష్' డైలీ కలెక్షన్స్ కంటే కూడా ఈ చిన్న సినిమా ఎక్కువ రాబడుతుండడం విశేషం. 'ఆదిపురుష్' చిత్రానికి 5 వ రోజు దాదాపుగా 2 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ 'బేబీ' చిత్రానికి 5 వ రోజు 2 కోట్ల 90 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : July 20, 2023 / 02:11 PM IST
    Follow us on

    Baby – Adipurush  Collections : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వం లో రీసెంట్ గా విడుదలైన ‘బేబీ’ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గడిచిన కొన్నేళ్ల నుండి ఏ స్టార్ హీరోకి కూడా సాధ్యం కానీ వసూళ్లను రాబడుతూ ఈ చిత్రం సృష్టిస్తున్న అద్భుతాలను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

    మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత రెండవ రోజు , మూడవ రోజు వసూళ్లు కూడా మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది. వాస్తవానికి ఇలాంటి ట్రెండ్స్ చిన్న సినిమాలకు సంక్రాంతి సీజన్ లో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ సీజన్ కానీ సీజన్ లో కూడా ఇలాంటి ట్రెండ్ కొనసాగుతుండడం విశేషం.

    ఇకపోతే రీసెంట్ గా 500 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాము అంటూ భారీ ప్రచారం చేసుకొని బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ డైలీ కలెక్షన్స్ కంటే కూడా ఈ చిన్న సినిమా ఎక్కువ రాబడుతుండడం విశేషం. ‘ఆదిపురుష్’ చిత్రానికి 5 వ రోజు దాదాపుగా 2 కోట్ల 43 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘బేబీ’ చిత్రానికి 5 వ రోజు 2 కోట్ల 90 లక్షణాలు రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఆ తర్వాత మూడవ రోజు , నాల్గవ రోజు కూడా ‘ఆదిపురుష్’ కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయింది ఈ చిత్రం. కంటెంట్ లో బలం ఉంటే స్టార్స్ అవసరం లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు నటించినా కూడా అద్భుతమైన వసూళ్లు వస్తాయి అని చెప్పడానికి ఉదాహరణే ఈ బేబీ చిత్రం . ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.