Baby Collections: ‘బేబీ’ 10 రోజుల వసూళ్లు..వంద కోట్ల రూపాయలకు అతి చేరువలో..!

మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు ఒక సూపర్ హిట్ మూవీ కి రావడం గతం లో మనం చాలా సార్లు చూసాం. అది కేవలం వీకెండ్స్ లో మాత్రమే సాధ్యపడేది. కానీ 'బేబీ' విషయం లో వర్కింగ్ డేస్ లో కూడా అలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 7 వ రోజు వరకు ఈ చిత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లింది. ట్రేడ్ పండితులకు అసలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమి జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.

Written By: Vicky, Updated On : July 24, 2023 8:48 am

Baby Collections

Follow us on

Baby Collections: విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించిన చిన్న సినిమా ‘బేబీ’. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరో గా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదలైన రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద సునామి లాంటి వసూళ్లను నమోదు చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు ఒక సూపర్ హిట్ మూవీ కి రావడం గతం లో మనం చాలా సార్లు చూసాం. అది కేవలం వీకెండ్స్ లో మాత్రమే సాధ్యపడేది. కానీ ‘బేబీ’ విషయం లో వర్కింగ్ డేస్ లో కూడా అలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 7 వ రోజు వరకు ఈ చిత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లింది. ట్రేడ్ పండితులకు అసలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమి జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.

ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఎంత వసూళ్లను ఈ చిత్రం రాబట్టిందో ఒకసారి చూద్దాము. 7 వ రోజు తో పోలిస్తే 8 వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయి, కానీ వీకెండ్ లో ఈ చిత్రం మళ్ళీ విశ్వరూపం చూపించేసింది. శనివారం రోజు రెండు కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక 10 వ రోజు, అనగా ఆదివారం రోజు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు మెంటలెక్కిపోయారు.

సుమారుగా నాలుగు కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కూడా రీసెంట్ సమయం లో సాధ్యపడని అరుదైన ఘట్టం ఇది. అలా 10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఫ్లో చూస్తూ ఉంటె రాబొయ్యే రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు, చూడాలి మరి.