https://oktelugu.com/

RRR Collection In Japan: జపాన్ లో అవతార్ 2 కలెక్షన్స్ ని దాటేసిన #RRR..ఇప్పటి వరకు ఎంత వసూళ్లు వచ్చాయంటే!

గత ఏడాది విడుదలైన ఈ సినిమా రీసెంట్ గానే 277 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. ఓటీటీ లో ఉన్న ఒక్క సినిమా ఇన్ని రోజులు దేశం కానీ దేశం లో ఆడడం అనేది చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఇప్పటికీ కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లతో రన్ అవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన సినిమాలు ఆది వెళ్లిపోతున్నాయి కానీ, #RRR చిత్రం ఆడుతూనే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : July 24, 2023 / 08:51 AM IST

    RRR Collection In Japan

    Follow us on

    RRR Collection In Japan: గత ఏడాది విడుదలైన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం , అంతకు మించి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు ని దక్కించుకోవడం, చివరికి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకోవడం, ఇవన్నీ తెలుగు సినీ అభిమానులకు ఎంతో గర్వకారణం.

    ఇక పోతే ఈ సినిమాని గత ఏడాది జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. మూవీ యూనిట్ మొత్తం జపాన్ కి వెళ్లి ప్రత్యేకమైన ప్రొమోషన్స్ చేసారు. అక్కడి మీడియాకి ఇంటర్వ్యూస్ కూడా బాగా ఇచ్చారు. ఫలితంగా ఈ చిత్రానికి కలలో కూడా ఊహించని రన్ వచ్చింది.

    గత ఏడాది విడుదలైన ఈ సినిమా రీసెంట్ గానే 277 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. ఓటీటీ లో ఉన్న ఒక్క సినిమా ఇన్ని రోజులు దేశం కానీ దేశం లో ఆడడం అనేది చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఇప్పటికీ కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లతో రన్ అవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన సినిమాలు ఆది వెళ్లిపోతున్నాయి కానీ, #RRR చిత్రం ఆడుతూనే ఉంది.

    ఇక ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రాన్ని జపాన్ లో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు. ఇన్ని రోజులు జపాన్ లో ఆడినది తెలుగు వెర్షన్ సినిమా. కానీ సబ్ టైటిల్స్ ని మాత్రం జపాన్ లో ఉంచారు. అందుకే ఈ సినిమాని ఆ రేంజ్ లో దుమ్ము లేపుతుంది. ఇక పోతే జపాన్ లో జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ చిత్రం 4.2 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. #RRR చిత్రం ఇప్పటి వరకు అక్కడ 2.2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది . ఇక ఈ నెల విడుదల అవ్వబొయ్యే జపాన్ వెర్షన్ తో అవతార్ 2 రికార్డుని బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు అంటున్నారు,చూడాలి మరి.