Babu Mohan Tribute To Kota Srinivasa Rao: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆభరణం లాంటి మహానటులలో ఒకరు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao). ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగం చేసుకునే ఆయన, సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి లెజెండరీ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన సినీ ప్రస్థానం లో వెయ్యని క్యారక్టర్ లేదు, చేయలేని పాత్ర లేదు. కామెడీ ని అయినా, విలనిజాన్ని అద్భుతంగా పండించడం లో అయినా కోట శ్రీనివాస రావు కి సాటి మరొకరు లేరు. మహానటుడు ఎస్వీ రంగారావు గారి నటనతో పోల్చుకోదగ్గ అర్హతలు కోట శ్రీనివాసరావు కి ఉన్నాయి. అలాంటి దిగ్గజ నటుడు నేడు తెల్లవారు జామున స్వర్గస్తులు అవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా కోట లాంటి విలక్షణ నటుడ్ని మళ్ళీ చూడలేము.
Also Read: కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం… వీడియో వైరల్
ఇదంతా పక్కన పెడితే కోట శ్రీనివాస రావు దాదాపుగా అందరూ ఆర్టిస్టులతో కలిసి నటించాడు. ప్రతీ ఒక్కరితో ఆయన కాంబినేషన్ అదుర్స్. కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మాత్రం బాబు మోహన్(Babu Mohan) తోనే కుదిరింది. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ని చూసి పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకునేవారు. రీల్ లైఫ్ లోనే కానీ, రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరు గొప్ప స్నేహితులు. ఒకే తల్లి కడుపులో పుట్టకపోయిన కూడా అన్నదమ్ములు లాగానే కొనసాగుతూ ఉండేవారు. అలాంటి అన్నయ్య ఈరోజు తనని వదిలి తిరిగిరాని లోకాలకు పయనం అవ్వడాన్ని బాబు మోహన్ జీర్ణించుకోలేకపోయాడు. కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన బాబు మోహన్ తనని తానూ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ‘అన్నా లే అన్నా’ అంటూ ఆయన భౌతిక కాయం పై పడి ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వీడియో ని చూసి నెటిజెన్స్ కూడా అయ్యో పాపం బాబు మోహన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాబు మోహన్ తో పాటుగా సినీ ప్రముఖులందరూ నేడు కోట శ్రీనివాస రావు ఇంటికి చేరుకొని నివాళ్లు అర్పించారు. చిరంజీవి(Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan),వెంకటేష్(Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), ఆర్ నారాయణ మూర్తి తదితర ప్రముఖులు కోటా శ్రీనివాస రావు భౌతికాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. బాబు మోహన్ తర్వాత హీరోలలో కోట శ్రీనివాస రావు తో అత్యధిక సినిమాలు చేసిన వారు పవన్ కళ్యాణ్, వెంకటేష్. వీళ్ళతో కోట శ్రీనివాస రావు కాంబినేషన్ సన్నివేశాలు అప్పట్లో ఒక సంచలనం. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో కోట కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. నేడు వీళ్లిద్దరు మీడియా తో కోట గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవ్వడం చర్చనీయాంశంగా మారింది.