Baahubali The Epic: మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యాక ఎన్నో చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడం చూసాము. కానీ ఎంత వసూళ్లను రాబట్టిన సినిమా అయినా, కేవలం వారం రోజులు, లేదా మూడు రోజుల థియేట్రికల్ రన్ ని మాత్రమే సొంతం చేసుకున్నాయి. కానీ ఒక రీ రిలీజ్ చిత్రం 40 రోజులు దాటి, 50 రోజుల వైపు పరుగులు తీయడం ఎప్పుడైనా చూసారా?, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈమధ్య కాలంలో ఎప్పుడూ అలా జరగలేదు. కానీ ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) విషయం లో అది జరిగింది. అక్టోబర్ 31 న విడుదలైన ఈ సినిమా 40 రోజుల థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని కేవలం స్టాండర్డ్ ఫార్మటు లో మాత్రమే కాదు, ఐమాక్స్ మరియు ఇతర ఫార్మట్స్ లో కూడా విడుదల చేశారు.
ఐమాక్స్ ఫార్మటు కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ అనుభూతి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని, మూడు గంటల 40 నిమిషాల ఈ సినిమాని చూస్తున్నంతసేపు ఒక కొత్త లోకం లోకి ప్రవేశించిన అనుభూతిని కలిగించిందని ఈ చిత్రాన్ని ఐమాక్స్ స్క్రీన్ లో చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో PCX (ఐమాక్స్ స్క్రీన్) లో ఈ చిత్రం దిగ్విజయంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజులు కూడా ఈ స్క్రీన్ ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికీ ప్రతీ రోజు ఫస్ట్ షో ప్రదర్శితమవుతుందని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుందని అంటున్నారు. డిసెంబర్ 12 న ‘అఖండ 2’ విడుదలైనా కూడా, ఈ సినిమా థియేట్రికల్ రన్ PCX స్క్రీన్ లో ఆగబోదని అంటున్నారు.
హైదరాబాద్ తో పాటు బెంగళూరు లోని ఒక ఐమాక్స్ స్క్రీన్ లో ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం ప్రదరిస్తామవుతుంది. ఇక్కడ కూడా ఈ చిత్రం 50 రోజుల రన్ ని పూర్తి చేసుకోబోతుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో కూడా ఆల్ టైం సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పింది. ‘బాహుబలి : ది ఎపిక్’ చిత్రానికి జరిగినంత అడ్వాన్స్ బుకింగ్స్, జనవరి 9న విడుదల కాబోతున్న ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్’ చిత్రానికి కూడా జరగడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వారం రోజుల క్రితం ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా, ఇప్పటి వరకు కనీసం లక్ష డాలర్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ‘బాహుబలి : ది ఎపిక్’ చిత్రానికి బుకింగ్స్ ని మొదలు పెట్టిన 24 గంటల్లోనే లక్ష డాలర్లు వచ్చాయి. దీన్ని బట్టీ బాహుబలి బ్రాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.