Tollywood: 2026వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్ గా మారబోతోంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరూ ఆ ఇయర్లో వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మార్చి నెలలో మాత్రం పెను విధ్వంసాలు జరగబోతున్నాయి… కన్నడ స్టార్ హీరో అయిన యశ్ ‘టాక్సిక్’ సినిమాని మార్చి 19 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకాస్తున్నాడు. సరిగ్గా ఈ మూవీ వచ్చిన వారానికి బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక ఆ సినిమాతో పాటు నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాని కూడా అదే రోజున రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ సినిమా గ్లింప్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాతో ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. ఇక పెద్ది, ప్యారడైజ్ సినిమా మధ్య విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ రికార్డులు మొత్తం తగలడిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
నాని బోల్డ్ కంటెంట్ తో వస్తున్నప్పటికి ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి…ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే నాని టైర్ వన్ హీరోగా మారిపోతాడు. రామ్ చరణ్ సైతం ఇప్పటికే టైర్ వన్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ కి నానికి మధ్య పోటీ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు.
కానీ హీరోల వైస్ గానే కాకుండా ఇక్కడ కంటెంట్ ను బేస్ చేసుకొని పోటీ ఉండబోతోంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసర సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమాతో పాటుగా వీళ్ళిద్దరి కాంబోలో ప్యారడైజ్ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…