Baahubali is ten years old : తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థితిగతులను మార్చేసిన చిత్రం ఏమిటంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బాహుబలి(Baahubali – The Beginning). ఇప్పుడు మన స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు దర్జా గా తీసుకుంటున్నారంటే అందుకు కారణం ‘బాహుబలి’. ఇది ఒక సినిమా కాదు, మన తెలుగు సినిమా మోడరన్ చరిత్ర. తెలుగు సినిమా స్థాయికి మించి డబ్బులు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని అప్పట్లో తీశారు. రాజమౌళి(SS Rajamouli) కి ఇవన్నీ అవసరమా?, మంచిగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా?, ఎందుకు ఇలాంటి ప్రయోగాలు అంటూ అప్పట్లో చాలా మంది కామెంట్స్ చేసేవారు. ‘మగధీర’ సమయం లో కూడా ఇలాంటి కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ ధైర్యం చేసి ఆ సినిమాని తెరకెక్కించారు. ఫలితం ఏంటో మనమంతా చూసాము. తానూ ‘బాహుబలి’ లాంటి చిత్రాన్ని తియ్యడానికి ధైర్యం ఇచ్చిన సినిమా మగధీర అంటూ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
Also Read: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రివ్యూ : సినిమాలో ఆ ఒక్కటి మైనస్ అయ్యే అవకాశం ఉందా..?
అలా భారీ బడ్జెట్ తో ప్రభాస్(Rebel Star Prabhas), రానా(Rana Daggubati) లు నటించిన ఈ చిత్రం 2015 వ సంవత్సరం , జులై 10 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కచ్చితంగా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి మొదటి ఆట నుండి వచ్చిన టాక్ ఏంటో తెలుసా?, డిజాస్టర్ టాక్. ఆరోజు వచ్చిన నెగటివ్ రివ్యూస్ ని చూసి రాజమౌళి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడట. వందల కోట్ల రూపాయిల బడ్జెట్, ఏళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోయిందా అంటూ బాధపడ్డాడట. కానీ ఫస్ట్ షోస్ నుండి టాక్ పూర్తిగా మారిపోయింది. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మర్క్స్ ని క్రియేట్ చేస్తూ, భవిష్యత్తులో ఎవ్వరూ ముట్టుకోలేని రేంజ్ రికార్డ్స్ ని నెలకొల్పుతూ ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన నితిన్ ‘తమ్ముడు’ చిత్రం..ఎందులో చూడాలంటే!
అయితే మొదటి భాగం ద్వారా నిర్మాతకు డబ్బులు మిగల్లేదు అని నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. టాక్సులు, జీఎస్టీలు, రెంటులు ఇలా అన్నీ కట్ అవ్వగా, నిర్మాత నష్టాల్లోకి వెళ్లాడని, కానీ రెండవ భాగంతో భారీ లాభాలను అందుకున్నాడని చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 చిత్రం విడుదలై 8 ఏళ్ళు అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ గ్యాప్ లో మన టాలీవుడ్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు విడుదల అయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ సినిమా కలెక్షన్స్ ని అందుకోలేకపోయాయి అంటే ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 31 న ఈ బాహుబలి సిరీస్ ని మొత్తం ఒక సినిమాగా చేసి థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారట. మరి ఈ రీ రిలీజ్ లో ఈ చిత్రం ఎలాంటి అద్భుతాలను