Thammudu OTT Release: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన నితిన్(Actor Nithin) ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, వారం రోజులు కూడా కాకముందే థియేట్రికల్ రన్ ని ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంతటి దారుణమైన పరాజయం హీరో నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకు లేదు. నితిన్ గత చిత్రం ‘రాబిన్ హుడ్’ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇంత తక్కువ వసూళ్లు వచ్చాయేంటి?, ఈ రేంజ్ ఫ్లాప్ నితిన్ ప్లాన్ చేసుకొని తీసిన కొట్టలేదు అని అందరు అనుకున్నారు. తీరా చూస్తే తమ్ముడు చిత్రం ‘రాబిన్ హుడ్’ కంటే పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆరు రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయిందంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోండి.
ఒకప్పుడు నితిన్ సినిమాలకు మొదటి రోజు ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చేవి. కానీ ఆయన గత రెండు చిత్రాల క్లోజింగ్ వసూళ్లు ఆరు కోట్ల కంటే తక్కువ ఉండడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు తన ప్రతీ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి అమ్ముతుంటాడు. కానీ ఈసారి మాత్రం ఆయన నెట్ ఫ్లిక్స్ కి విక్రయించాడు. అయితే నెట్ ఫ్లిక్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత విడుదల చెయ్యాలి. అంటే ఆగష్టు లో అన్నమాట. కానీ సినిమా అనూహ్యంగా మొదటి వారం లోపే చతికిల పడడంతో ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారట.
Also Read: భర్తతో విడాకులంటూ ప్రచారం.. నయనతార రియాక్ట్ ఇదే
‘రాబిన్ హుడ్’ చిత్రం థియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అయినా, ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. జీ5 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. ‘తమ్ముడు’ చిత్రం కూడా ఓటీటీ లో విడుదలయ్యాక ఇలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని దాదాపుగా 70 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 30 కోట్ల రూపాయిలు రీ కవర్ అయ్యాయి. కానీ థియేటర్స్ నుండి ఈ చిత్రం రాబట్టింది ఏమి లేదు. ఓవరాల్ గా టేబుల్ ప్రాఫిట్స్ తో సేఫ్ గా ఉండే దిల్ రాజు, ఈ సినిమా విషయం లో అడ్డంగా దొరికిపోయాడు. చూడాలి మరీ కనీసం ఓటీటీ లో అయినా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనేది.
