Baahubali 2 Piracy: ఒక సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఆ మూవీకి పనిచేసిన చాలా మందికి ఒక మంచి లైఫ్ దొరుకుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమా బాగున్నప్పటికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాను చూసే పరిస్థితి లేకుండా పోయింది…దానికి ముఖ్య కారణం టికెట్ రేట్ పెంచడం ఒకటైతే, సినిమా హెచ్డి పైరసీ ప్రింట్ రావడం మరొకెత్తనే చెప్పాలి. ఒకప్పుడు చాలామంది ప్రేక్షకులు థియేటర్లో సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో పైరసీ విపరీతంగా పెరిగిపోవడంతో సినిమాలను ఎక్కడికక్కడ పైరసీ చేసి సైట్లలో వదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘బాహుబలి 2’ సినిమాని కూడా పైరసీ చేశారు. ఈ క్రమంలో డీసీపీ అవినాష్ మహంతి ఒక ఆపరేషన్ నిర్వహించి ‘బాహుబలి 2’ సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు ఆ పైరసీ చేసిన వాళ్లను పట్టుకున్నారు. నిజానికి పైరసీ ఎలా చేస్తారు, వాళ్ళని ఎలా పట్టుకున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
‘బాహుబలి 2’ సినిమాకి రెండు రోజులు ముందు ఒక ఫేక్ కాల్ నుంచి బాహుబలి ప్రొడక్షన్ హౌజ్ కి బాహుబలి పైరసీని హెచ్డి ప్రింట్ రిలీజ్ చేశాం. మీరు 50 లక్షలు ఇవ్వకపోతే ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందే దాన్ని సైట్ లో పెట్టేస్తామని చెప్పారట. దాంతో సినిమా యూనిట్ సైబర్ పోలీస్ ఆఫీసర్స్ ని సంప్రదించారు. దాంతో రంగంలోకి దిగిన డిసిపి ‘అవినాష్ మహంతి’ ఆర్కా మీడియా పిఆర్ టీమ్ లాగా గెటప్ వేసుకొని వచ్చిన వ్యక్తిని కలిసి ఒకరోజు పాటు వాళ్ళతోనే ఉండి వాళ్ళ టోటల్ నెట్ వర్క్ ఎంతో తెలుసుకోవాలని చూశాడట.అలాగే వీళ్ళకు పైరసీ చేస్తున్నారు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశానని డిసిపి అవినాష్ తెలియజేశాడు. ఒక సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచి గాని లేదంటే ఇతర క్రాఫ్ట్ ల వాళ్ళు తమ పని చేస్తున్నప్పుడు గాని పైరసీ జరుగుతుందని అది పర్ఫెక్ట్ గా ఎక్కడినుంచి జరుగుతుందనేది మనం చెప్పలేమని కానీ పైరసీ చేసే వాళ్లను మాత్రం మనం పట్టుకోవాలని నిర్ణయించుకొని రంగం లోకి దిగాడట.
మొత్తానికైతే ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేసిన వాడిని పట్టుకొని వాడి ఫోన్ ట్రాప్ చేయిస్తే ఆ ప్రాసెస్ లో వాడు తరచుగా బీహార్ ఢిల్లీలో తనకంటే పైన ఉన్నవారితో మాట్లాడుతున్నాడట. మొత్తానికైతే ఫోన్ ట్రాప్ చేసే వాళ్లెవరో కనుకున్నారట. విని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తో పైరసీ వాళ్ళను పట్టుకోవడానికి ద్వారా పోలీసులు రెండు బ్యాచులుగా విడిపోయి ఒక టీమ్ బీహార్, మరొక టీమ్ ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు.
అక్కడ కూడా తమకు చాలా రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికి కొంతమందిని మాత్రం పట్టుకొని పైరసీ ని కట్టడి చేసే ప్రయత్నం చేశామని చెప్పాడు. జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకి ఇంత సమాచారం దొరికిందని చెప్పారు. మొత్తానికైతే పైరసీ చేసిన వాళ్ళలో కొందరు దొరికారని, మరికొందరు తప్పించుకున్నారని చెప్పాడు.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాలను చూడకపోవడానికి గల ముఖ్య కారణం పైరసీ అనే చెప్పాలి. సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజులోపే పైరసీ రావడంతో వాళ్లు ఫ్యామిలీ మొత్తం కలిసి మొబైల్ లో గాని లేదంటే టీవీలో గాని ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు… ఇక దీనికి వీలైనంత తొందరగా చెక్ పెడితే తప్ప సినిమా ఇండస్ట్రీ బాగుపడదనే చెప్పాలి…