https://oktelugu.com/

Akhanda: అప్పటి బాలయ్య-బి.గోపాల్​ కాంబో హిట్​ మళ్లీ బోయపాటితో తిరిగొచ్చిందా?

Akhanda: టాలీవుడ్​లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు టాప్​ డైరక్టర్ల హస్త ఉంది. గతంలో బాలయ్య బి. గోపాల్​ కాంబినేషన్​లో వచ్చే సినిమాలు బాక్సాఫీసు వద్ద చరిత్రను తిరగరాశాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన చాలా హిట్లు ఉన్నాయి. లారీ డ్రైవర్​, రౌజీ ఇన్​స్పెక్టర్​, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్​ డూపర్​ హిట్​ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే, అంతే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 11:33 AM IST
    Follow us on

    Akhanda: టాలీవుడ్​లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు టాప్​ డైరక్టర్ల హస్త ఉంది. గతంలో బాలయ్య బి. గోపాల్​ కాంబినేషన్​లో వచ్చే సినిమాలు బాక్సాఫీసు వద్ద చరిత్రను తిరగరాశాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన చాలా హిట్లు ఉన్నాయి. లారీ డ్రైవర్​, రౌజీ ఇన్​స్పెక్టర్​, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్​ డూపర్​ హిట్​ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే, అంతే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాపీసు వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా రాలేదు.

    అయితే, ఇప్పుడు బి. గోపాల్​ స్థానంలో బాలయ్యకు బోయపాటి శ్రీను దొరికినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలతో హిట్లు మీద హిట్లు అందిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్​ చిత్రాలు ఇండస్ట్రీని షేక్ ఆడించాయి. తాజాగా, అఖండ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు మళ్లీ పాతరోజులను గుర్తుచేస్తున్నారు.  అఖండ సినిమా చూసిన వాళ్లంతా బాలయ్య ఈస్​ బ్యాక్.. అంటూ నీరాజనాలు పడుతున్నారు. ఆయన నటన, డైలాగ్​లు, యాక్షన్​ సీన్లు ఇలా సినిమా మొత్తం పూనకాలు తెప్పించేలా ఉందని అంటున్నారు. ప్రస్తుత కాలంలో వెండితెరపై బాలయ్యను ఎలా చూపించాలో తెలిసిన ఏకైకన డైరెక్టర్​ బోయపాటి ఒక్కరేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే సినిమా విడుదలైన తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టింది.

    కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​కాగా.. శ్రీకాంత్​, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించారు. థమన్​ తన మ్యూజిక్​తో సినిమాకు ప్రాణం పోశారు.