Avatar 3 Collection Day 5: మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘అవతార్’ సిరీస్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2010 వ సంవత్సరం లో విడుదలైన ‘అవతార్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. ఇక ‘అవతార్ 2 :ది వే ఆఫ్ వాటర్’ చిత్రానికి అయితే తెలుగు రాష్ట్రాల నుండి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 380 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) చిత్రానికి ఇండియా వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 450 కోట్ల రూపాయిల గ్రాస్ కి జరిగింది.
అంటే 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ అని అనిపించుకుంటుంది. కానీ 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి కేవలం 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. గత చిత్రం తో పోలిస్తే ఇది చాలా అనే చాలా తక్కువ వసూళ్లు అనే చెప్పాలి. అంతే కాదు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని లాంగ్ రన్ లో కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు. కారణం ఆడియన్స్ కి ఇప్పటికీ ‘దురంధర్’ చిత్రమే మొదటి ఛాయస్ గా ఉండడం వల్లే. ఆ సినిమాకు వసూళ్ల సునామీ ఆగడం లేదు. దాని ప్రభావం ఈ చిత్రం పై చాలా బలంగా పడుతోంది. ఫలితంగా ఈ చిత్రం ఇండియా లో డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకోబోతుంది అని చెప్పొచ్చు.
మొదటి సోమవారం, అనగా నిన్న ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా కేవలం 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు అయ్యిందట. అంటే ‘దురంధర్’ చిత్రం ఆక్యుపెన్సీ లో సగం అన్నమాట. 5 వ రోజే ఇలా పడిపోతే, ఇక లాంగ్ రన్ ఈ చిత్రానికి ఏముంటుంది చెప్పండి. ఇక నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ప్రీమియర్ షోస్ తో పాటు, మొదటి 5 రోజులకు కలిపి నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 100 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. సోమవారం రోజున ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 13 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట. ఇక అంతర్జాతీయ మార్కెట్ ని కూడా కలుపుకొని చూస్తే ఈ చిత్రానికి మొదటి 5 రోజులకు కలిపి 400 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట. ఫుల్ రన్ లో ఇలా అయితే 2 బిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టడం కూడా కష్టమే.