NTR-Trivikram movie: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒక సినిమాతో హీరో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరొక హీరో అలాంటి కథతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక దర్శకుల మధ్య కూడా పోటీ ఎక్కువైపోయింది. కారణమేంటి అంటే పాన్ ఇండియాలో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన వారు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతున్నారు. మాటల మాంత్రికుడిగా తనదైన రీతిలో హవా చూపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత దర్శకుడిగా మారి ప్రేక్షక్లందరిని మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో మైథాలజికల్ థ్రిల్లర్ సినిమాని చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఇప్పుడు ఆ సబ్జెక్టు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిందనే వార్తలైతే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం పెద్దగా మార్కెట్ లేదు.ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా అంత గొప్పగా రావడం లేదనే పుకార్లైతే వినిపిస్తున్నాయి. ఇక వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ తో ఈ సినిమా వర్కౌట్ అవ్వదని ఒక నిర్ణయానికి వచ్చేసారు.
దాంతో అల్లు అర్జున్ అయితేనే ఈ సినిమాకి న్యాయం చేయగలడనే ఉద్దేశ్యంతో ఇదే కథని అల్లు అర్జున్ కి చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది…
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో కేవలం 500 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే కొల్లగొట్టాడు. ఇక ‘వార్ 2’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఎన్టీఆర్ ఆ సినిమాలో చేయకపోయినా బాగుండేది అని అతని అభిమానులే అనుకున్నారు అంటే ఆ సినిమా ఎంత వరస్ట్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఎన్టీఆర్ పరిస్థితి ఇలా ఉంటే అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం తారస్థాయిలో ఉంది.
‘పుష్ప 2’ సినిమాతో 1950 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు మరోసారి 2000 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి త్రివిక్రమ్ నాగవంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వెయ్యికోట్ల బడ్జెట్ రాబోతోంది. దానివల్ల అల్లు అర్జున్ అయితేనే ఆ ప్రాజెక్టుకి న్యాయం జరుగుతుందని, ఆయన అయితేనే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయనే ఉద్దేశ్యంతో ఇటు దర్శకుడు, అటు నిర్మాత ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది…