Homeఎంటర్టైన్మెంట్Avatar 3 Collection Day 5: 450 కోట్ల టార్గెట్..కానీ 5 రోజుల్లో ఇండియా...

Avatar 3 Collection Day 5: 450 కోట్ల టార్గెట్..కానీ 5 రోజుల్లో ఇండియా వైడ్ ‘అవతార్ 3’ రాబట్టిన గ్రాస్ ఎంతంటే!

Avatar 3 Collection Day 5: మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘అవతార్’ సిరీస్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2010 వ సంవత్సరం లో విడుదలైన ‘అవతార్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. ఇక ‘అవతార్ 2 :ది వే ఆఫ్ […]

Avatar 3 Collection Day 5: మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘అవతార్’ సిరీస్ కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2010 వ సంవత్సరం లో విడుదలైన ‘అవతార్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ లేవు. ఇక ‘అవతార్ 2 :ది వే ఆఫ్ వాటర్’ చిత్రానికి అయితే తెలుగు రాష్ట్రాల నుండి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 380 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) చిత్రానికి ఇండియా వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 450 కోట్ల రూపాయిల గ్రాస్ కి జరిగింది.

అంటే 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ అని అనిపించుకుంటుంది. కానీ 5 రోజులకు కలిపి ఈ చిత్రానికి కేవలం 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. గత చిత్రం తో పోలిస్తే ఇది చాలా అనే చాలా తక్కువ వసూళ్లు అనే చెప్పాలి. అంతే కాదు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని లాంగ్ రన్ లో కూడా అందుకోవడం కష్టమే అని అంటున్నారు. కారణం ఆడియన్స్ కి ఇప్పటికీ ‘దురంధర్’ చిత్రమే మొదటి ఛాయస్ గా ఉండడం వల్లే. ఆ సినిమాకు వసూళ్ల సునామీ ఆగడం లేదు. దాని ప్రభావం ఈ చిత్రం పై చాలా బలంగా పడుతోంది. ఫలితంగా ఈ చిత్రం ఇండియా లో డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకోబోతుంది అని చెప్పొచ్చు.

మొదటి సోమవారం, అనగా నిన్న ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా కేవలం 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు అయ్యిందట. అంటే ‘దురంధర్’ చిత్రం ఆక్యుపెన్సీ లో సగం అన్నమాట. 5 వ రోజే ఇలా పడిపోతే, ఇక లాంగ్ రన్ ఈ చిత్రానికి ఏముంటుంది చెప్పండి. ఇక నార్త్ అమెరికా లో కూడా ఈ చిత్రానికి ఆశించిన స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం లేదు. ప్రీమియర్ షోస్ తో పాటు, మొదటి 5 రోజులకు కలిపి నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 100 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. సోమవారం రోజున ఈ చిత్రానికి నార్త్ అమెరికా నుండి 13 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట. ఇక అంతర్జాతీయ మార్కెట్ ని కూడా కలుపుకొని చూస్తే ఈ చిత్రానికి మొదటి 5 రోజులకు కలిపి 400 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందట. ఫుల్ రన్ లో ఇలా అయితే 2 బిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టడం కూడా కష్టమే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper