Akhanda 2 vs Mowgli : బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘అఖండ 2’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతూ కలెక్షన్స్ కొల్లగొడుతోంది. వరుసగా నాలుగు విజయాలు అందుకున్న బాలయ్య బాబుకు మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసిందని చాలామంది చెబుతూ ఉండడం విశేషం…ఇక ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకుంటే ఇందులో పెద్దగా కంటెంట్ ఏమీ లేదని బోయపాటి మార్క్ మేకింగ్, బాలయ్య బాబు యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే మిగిలినదంతా రొటీన్ గానే ఉందని చాలామంది చెబుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాతో పోటీగా రిలీజ్ అయిన మోగ్లీ సినిమా మొదటి షో తోనే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాని చూడడానికి ఎవ్వరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ రెండు సినిమాల మధ్య ఏ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది అనే ఒక డౌట్ అందరిలో ఉంది. ప్రస్తుతానికైతే ‘అఖండ 2’ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను సంపాదించుకుంటుంది. సినిమా కంటెంట్ పరంగా వీక్ అయినప్పటికి మూవీలోని విజువల్స్ గాని, బాలయ్య శివతాండవం కానీ అద్భుతంగా ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మొత్తానికైతే ఈ వీకెండ్ బాలయ్య బాబు పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి. ఇక మోగ్లీ సినిమాకి కొంతవరకు ఆదరణ దక్కుతున్నప్పటికి అది కూడా పెద్ద సంఖ్యలో కాకపోవడం వల్ల ఈ సినిమా బిలో ఆవరేజ్ గా నిలిచే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ రెండు సినిమాలు లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని వసూలు చేస్తాయి. తద్వారా తమ సినిమా బ్రేక్ ఈవెన్ గా మారుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
వచ్చేవారం ‘అవతార్ 3’ సినిమా వస్తోంది. కాబట్టి ఈ రెండు సినిమాలు ఈ వారం రోజులపాటు తమ కలెక్షన్స్ ని కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది. ఇక తర్వాత అవతార్ 3 కి పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే మాత్రం ఆ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతాయి. ప్రేక్షకులు సైతం ఆ సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తారు…