Homeఆంధ్రప్రదేశ్‌జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

జగన్ కు కీలకమైన సూచనలు చేసిన ఏంపీ..!

 

 

Raghurama Krishnam Raju

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన జగన్ కు కోన్ని కీలకమైన సూచనలు చేశారు. గవర్నర్ ఆదేశాల తరువాత కూడా కోర్టు తీర్పును పాటించకపోవడం దారుణమైన విషయంగా పరిగణించాల్సిందేనని, గవర్నర్ ఆదేశాలను పాటించకుండా రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పులను గౌరవించాలని కోరారు.

Also Read: సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి నిరాశ..!

కోర్టు తీర్పులను గౌరవించడం వైసీపీ సిద్ధాంతమైనప్పటికీ… పార్టీలో అపార్ధం చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు కీలక నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సిఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను నేటి నుంచైనా అమలు చేయడం మొదలుపెట్టాలని హితవు పలికారు. నిమ్మగడ్డ విషయంలో కోర్టు తీర్పు తనతోపాటు, నూటికి 99 శాతం మంది ముందుగానే ఊహించిందేనన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పదేపదే న్యాయస్థానాలు గుర్తు చేస్తున్నా కొందరు ఆ బాధ్యతను పెడచెవిన పెట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులకు గురించి చెప్పుకొచ్చారు.

వైసీపీ సోకాజ్ నోటీసు పంపించడం, అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వినతి ప్రతాన్ని అందించడం వంటి చర్యలతో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ, ప్రభుత్వంపై ఎదురుదాడిని పెంచారు. దీనికితోడు లోక్ సభలో తన సీటు మార్పించడంలో వైసీపీ సఫలీకృతం కావడంతో ప్రభుత్వాన్ని పలు అంశాలపై జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ధ్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని, గతంలో అమరావతిని రాజధానిగా అసెంబ్లీలో అంగీకరించడం, ఇప్పుడు కులాల అంశాన్ని లేవనెత్తడం వంటి అంశాలను రాష్ట్రపతికి వివరించినట్లు మీడియాకు వెల్లడించిన విషయం విధితమే. తాజాగా నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు వ్యతిరేకించిన అనంతరం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమ్మకానికి అమరావతి భూములు..!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు ఆదేశాలతో తలనొప్పితో ఉన్న ప్రభుత్వానికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వాఖ్యలు పుండుమీద కారం జల్లినట్లుగా ఉన్నాయి. ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆలోచనతో వైసీపీ ముఖ్యనాయకులు ఉన్నారు. ఎంపీ రాఘురామ కృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ ఎంత కాలం ఓపిక పడుతుందో వేచి చూడాల్సిందే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version