https://oktelugu.com/

Anasuya Bharadwaj: ఆంటీ వివాదం సెగ… అనసూయ చేతి నుండి మూడు ప్రాజెక్ట్స్ అవుట్?

Anasuya Bharadwaj: తాజా వివాదం అనసూయ కెరీర్ ని నాశనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.ఆల్రెడీ మూడు ప్రాజెక్ట్స్ నుండి ఆమెను తప్పించారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దారుణమైన నెగిటివిటీ మూటగట్టుకుంటున్న అనసూయ మన చిత్రంలో ఉంటే అసలుకే ఎసరని మేకర్స్ భావిస్తున్నారట. చివరికి పుష్ప 2 చిత్రం నుండి కూడా ఆమెను తప్పించారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. దర్శకుడు సుకుమార్ ఆమె స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. పుష్ప పార్ట్ 1 లో అనసూయ దాక్షాయణిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : September 2, 2022 / 10:15 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: తాజా వివాదం అనసూయ కెరీర్ ని నాశనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.ఆల్రెడీ మూడు ప్రాజెక్ట్స్ నుండి ఆమెను తప్పించారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దారుణమైన నెగిటివిటీ మూటగట్టుకుంటున్న అనసూయ మన చిత్రంలో ఉంటే అసలుకే ఎసరని మేకర్స్ భావిస్తున్నారట. చివరికి పుష్ప 2 చిత్రం నుండి కూడా ఆమెను తప్పించారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. దర్శకుడు సుకుమార్ ఆమె స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. పుష్ప పార్ట్ 1 లో అనసూయ దాక్షాయణిగా మాస్ అండ్ డీగ్లామర్ రోల్ లో కనిపించి అలరించారు. అనసూయ నటుడు సునీల్ భార్య రోల్ చేశారు.

    Anasuya Bharadwaj

    అలాగే మరో ఇద్దరు దర్శకులు ఆమెను పక్కన పెట్టేశారనే మాట వినిపిస్తుంది. యాంకరింగ్ కూడా పక్కన పెట్టిన అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. అలాగే ఆమె లీడింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో దర్జా తెరకెక్కింది. అలాగే వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో కీలక రోల్ చేశారు. వెండితెర ఆఫర్స్ ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న తరుణంలో అనవసర వివాదాల్లో తల దూర్చి అనసూయ కెరీర్ నాశనం చేసుకుంటుంది.

    Also Read: Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?

    తనకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో అనసూయ వదిలేశారు. బయటికి వచ్చాక జీవితం ఇచ్చిన ఆ షోపైనే అనసూయ విమర్శలు చేశారు. అక్కడ తాను బాడీ షేమింగ్ కి గురయ్యాను అన్నారు. తన శరీరాన్ని ఉద్దేశిస్తూ కమెడియన్స్ వేసే పంచ్లు మానసికంగా ఇబ్బంది పెట్టేవి. ఆ సందర్భంలో నేను కోప్పడితే అది షోలో చూపించరు. ఎడిటింగ్ లో తీసేస్తారు. గత రెండేళ్లుగా జబర్దస్త్ నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనసూయ చెప్పడం విశేషం.

    Anasuya Bharadwaj

    లైగర్ మూవీ ఫెయిల్యూర్ పై పరోక్షంగా ట్వీట్ వేసి అనసూయ వివాదానికి బీజం వేశారు. విజయ్ దేవరకొండను కర్మఫలం వెంటాడింది, అందుకే లైగర్ ప్లాప్ అయ్యింది అని అర్థం వచ్చేలా అనసూయ ట్వీట్ చేశారు. అది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం కాగా, ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ వివాదంలో అనసూయకు పరిశ్రమ నుండి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. కారణం ఆమెదే తప్పని వారు భావిస్తూ ఉండవచ్చు. నటుడు బ్రహ్మాజీ అనసూయపై ఇండైరెక్ట్ సెటైర్ చేయగా, అనసూయ స్పందించకపోవడం విశేషం. పరిశ్రమ వర్గాలు ఆమెపై కోపంగా ఉన్నాయి అనడానికి ఇదో నిదర్శనం.

    Also Read: Chiranjeevi Daughter Sreeja: చిరంజీవి కూతురు శ్రీజకు షాక్… మరో పెళ్ళికి సిద్దమైన కళ్యాణ్ దేవ్!

    Tags