https://oktelugu.com/

Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?

Power Star Pawan Kalyan: తెలుగు సినిమా పరిశ్రమలో అశేష అభిమాన గణం ఉన్న హీరో ఎవరంటే పవన్ కల్యాణ్ అని చెబుతుంటారు. ఆయనకు ఉన్న క్రేజీ అలాంటిది. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న కథానాయకుడు పవన్. నటన పరంగానే కాకుండా వ్యక్తిగతంగా.. సామాజిక సేవకుడిగా పవన్ కల్యాణ్ అంటే అందరికి ఇష్టమే. ఆయన సినిమాలు ఇష్టపడని వారంటే ఉండరు. అంతటి ప్రావీణ్యం కలిగిన హీరో కావడంతో తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 2, 2022 / 10:01 AM IST
    Follow us on

    Power Star Pawan Kalyan: తెలుగు సినిమా పరిశ్రమలో అశేష అభిమాన గణం ఉన్న హీరో ఎవరంటే పవన్ కల్యాణ్ అని చెబుతుంటారు. ఆయనకు ఉన్న క్రేజీ అలాంటిది. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న కథానాయకుడు పవన్. నటన పరంగానే కాకుండా వ్యక్తిగతంగా.. సామాజిక సేవకుడిగా పవన్ కల్యాణ్ అంటే అందరికి ఇష్టమే. ఆయన సినిమాలు ఇష్టపడని వారంటే ఉండరు. అంతటి ప్రావీణ్యం కలిగిన హీరో కావడంతో తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో సినీ రంగ ప్రవేశం చేసి అన్నయ్యకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. పవన్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. వారి ఆనందాలకు అవధులు ఉండవు.

    Power Star Pawan Kalyan, posani

    చిరంజీవికి మెగాస్టార్ వచ్చినట్లే పవన్ కల్యాణ్ కు ‘పవర్ స్టార్’ బిరుదు దక్కింది. ఈ బిరుదు రావడానికి కూడా ఓ చరిత్ర ఉంది. మొదటి సినిమా అంతగా ఆడకపోవడంతో రెండో సినిమా ‘గోకులంలో సీత’ తమిళంలో విజయవంతమైన సినిమాను తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. సినిమా విజయోత్సవ సభలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ ‘కల్యాణ్ బాబు’ను కాస్తా పవన్ కల్యాణ్ గా సంబోధించారు. అంతే కాదు ‘పవర్ స్టార్’ అనే బిరుదు కూడా ఆయన ఇచ్చారు.

    Also Read: Anasuya Bharadwaj: ఆంటీ వివాదం సెగ… అనసూయ చేతి నుండి మూడు ప్రాజెక్ట్స్ అవుట్?

    ఈ విషయం చాలాసార్లు పవన్ కల్యాణ్, పోసాని ఇద్దరు కూడా చెప్పారు. నాటి మాటల రచయిత పోసాని కృష్ణమురళినే ‘కల్యాణ్ బాబు’ను కాస్తా పవన్ కల్యాణ్ గా మార్చారన్న మాట.. తరువాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుస్వాగతం’ చిత్రంలో మొదటి సారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని సినిమాలో పేరుగా వేశారు. దీంతో అప్పటి నుంచి పవన్ కల్యాణ్ గా మారిపోయారు. ఇక వెనుదిరిగి చూడలేదు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్ స్టార్ హీరోగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

    Power Star Pawan Kalyan, posani

    అన్నకు తగ్గ తమ్ముడనే పేరును పవన్ సార్థకం చేసుకుంటున్నాడు. పవర్ స్టార్ గా ఫ్యాన్స్ గుండెల్లో ఉండిపోయారు. మెగాస్టార్ చిరంజీవి బాటలోనే నడుస్తూ మెగా ఫ్యామిలీకి దొరికిన మరో ఆణిముత్యంలా నిలుస్తున్నాడు. సినీ హీరోగా.. ఇటు రాజకీయ నాయకుడిగా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్ గా విభిన్న కోణాలను ఆవిష్కరించి పవన్ కళ్యాణ్ తనలోని టాలెంట్ ను నిరూపించుకున్నారు.

    Also Read:Ali-Posani: ఆలీ, పోసానికి నామినేటెడ్ పదవులు ఫిక్స్.. జగన్ సంచలన నిర్ణయం?

    Tags