Marital Life: మన దేశంలోని వివాహ వ్యవస్థకు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసి ఉండటంపై పాశ్చాత్యులు మక్కువ చూపిస్తుంటారు. మన ఆచార వ్యవహారాలకు అంతటి విలువ ఉంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మన ఆచార వ్యవహారాల్లో పాశ్చాత్య పోకడలు రావడంతో సంసారాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. విడాకుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. పూర్వం రోజుల్లో భార్యాభర్తల ఉన్న అనుబంధం చూస్తే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. వారు వందేళ్లు ఎలాంటి అరమరికలు లేకుండా తమ జీవితాలను సాగించడం అంటే మాటలు కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సహనం నశించి చీటికి మాటికి గొడవలు తెచ్చుకుంటూ అభిప్రాయ భేదాలతో విడిపోతుండటం గమనార్హం.

దాంపత్య జీవితం సరిగా సాగాలంటో ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం కావాలి. అనుబంధం మరింత బలపడాలంటే ఇద్దరి మధ్య సంభాషణలు ఉండాలి. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలి. వీలైతే కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడ సంతోషంగా గడిపితే ఇద్దరి మధ్య అన్యోన్యం పెరుగుతుంది. తద్వారా ప్రేమ బంధం బలపడుతుంది. ఆలుమగల మధ్య అనురాగం విస్తరిస్తుంది. అదే జీవితానికి కావాల్సిన అనుభూతి ఇస్తుంది. దీంతోనే వారి ఎడబాటును దూరం చేసుకునే అవకాశం కలుగుతుంది.
Also Read: Anasuya Bharadwaj: ఆంటీ వివాదం సెగ… అనసూయ చేతి నుండి మూడు ప్రాజెక్ట్స్ అవుట్?
జీవిత భాగస్వామికి సందర్భోచితంగా బహుమతులు అందజేయాలి. పండుగలు, పెళ్లిరోజులకు కానుకలు అందజేస్తే వారిలో పట్టరాని సంతోషం కలుగుతుంది. దీంతో ఇద్దరిలో ప్రేమానురాగాలు పెరిగే సూచనలున్నాయి. చిన్న చిన్న చిట్కాలతోనే జీవిత భాగస్వామిని సంబరపెట్టొచ్చు. దంపతుల్లో దాపరికాలు ఉండకూడదు. అలాగని ఏది పడితే అది చెబితే మన ప్రతిష్ట మంటగలుస్తుంది. కొన్నింటిని చెప్పకూడదు. సాధారణ విషయాలను పంచుకుంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.

జీవిత భాగస్వామితో ఏదో ఒకటి మాట్లాడుతుండాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. విశ్వాసం పెరగాలి. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కావాల్సిన విషయాలను కూడా చర్చిస్తుండాలి. శృంగారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారానికి కనీసం రెండు మూడు సార్లయినా సెక్స్ లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తే వారి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రావు. దీనికి గాను పలు విషయాలను పక్కన పెట్టకుండా ఆలోచిస్తూ పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటూ నూరేళ్ల జీవితానికి పూల బాటలు వేసుకునే సంసార బంధాన్ని బలోపేతం చేసుకుంటేనే ప్రతి ఒక్కరి జీవితం నందనవనంగా మారుతుందని తెలుసుకోవాలి.
Also Read:Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?