Bigg Boss 9 Telugu Voting: టెలివిజన్ రంగంలో భారీ గుర్తింపును సంపాదించుకున్న రియాల్టీ షో బిగ్ బాస్… ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ ను స్టార్ట్ చేశారు… ఈ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్నప్పటికి గత కొద్ది వారాల నుంచి ఈ షో మీద నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కటస్టెంట్ల విషయంలో వ్యతిరేకత ఎక్కువగా పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో చాలా మంచి పేరు సంపాదించుకుంటూ టాస్క్ లను సక్సెస్ ఫుల్ ఫినిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్లను సైతం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారు.గతవారం శ్రీజ దమ్ముని ఎలిమెంట్ చేశారు. తను హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి తను ఎలిమినేట్ అయ్యే రోజు వరకు చాలా టాస్కులను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తూ వచ్చింది. తనకు ఓటింగ్ కూడా చాలా ఎక్కువగానే వచ్చాయి. అయినప్పటికి తనను ఎలిమినేట్ చేశారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళ విషయంలో బిగ్ బాస్ చాలావరకు సానుకూల దృక్పథాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే వాళ్ళని వదిలేసి హౌజ్ లో స్ట్రాంగ్ కాంటెస్టెంట్స్ అయిన వాళ్ళను ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక ఈ వారం భరణిని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మొదటి రోజు నుంచి ఏమాత్రం వ్యతిరేకత లేకుండా చాలా సెలెక్టెడ్ గా తన టాస్క్ లను ఆడుతూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అతనికి భారీగా ఓటింగ్ వచ్చినప్పటికి అతన్ని హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ తనే అంటూ కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ ను అసలు పట్టించుకోవడం లేదనే విషయం క్లారిటీ తెలిసిపోతోంది. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌజ్ లో రచ్చ రచ్చ చేస్తుంటే వారిని వదిలేసి మంచి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం ఏంటి? అనే ధోరణిలో కూడా కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియను నాగార్జున చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
కేవలం పేరుకు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని చెబుతున్నారు. అంతే తప్ప వాళ్ల ఓటింగ్ ను పట్టించుకోవడం లేదు…ఇక మీదట కూడా ఇలానే కొనసాగితే ఈ షో మీద ఇంకా వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. బిగ్ బాస్ యాజమాన్యం ఎందుకని ఇలా వ్యవహరిస్తుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు…