Pradeep Ranganathan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్…తెలుగులో సైతం అతనికి భారీ మార్కెట్ ఏర్పడింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. మరోసారి డ్యూడ్ సీఎంతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ప్రస్తుతక ఆయన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్టుగా తెలుస్తోంది. డ్రాగన్ సినిమా కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ఆ తర్వాత చేసిన డ్యూడ్ సినిమా కోసం 12 కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్ చేశాడు. ఇక ఇప్పుడు డ్యూడ్ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి మంచి విజయాలను సాధిస్తూ ప్రొడ్యూసర్స్ కి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్ సైతం ఆయన ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని చూస్తున్నాడు.
ఇక దానికోసమే తను తదుపరి చేయబోతున్న సినిమాల విషయంలో ఈ రెమ్యూనరేషన్ వర్తిస్తుందని ప్రొడ్యూసర్లకు చెబుతున్నారట. మొత్తానికైతే మొదట డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరో రేస్ లో ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
అతని బాడీ లాంగ్వేజే అతనికి చాలా వరకు ప్లస్ అవుతోంది. గతంలో అతని మీద కొంతమంది ఇతను హీరో ఏంటి అంటూ విమర్శలు చేసినప్పటికి తనని తాను మార్చుకుంటూ తన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కాబట్టే ఆయన ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాడు… ఆయనలా ఈ మధ్యకాలంలో అంత బాగా పాపులర్ అయిన తెలుగు హీరోలెవ్వరు లేకపోవడం చాలా దారుణమైన విషయమనే చెప్పాలి.
ఇక తెలుగులో అలాంటి యూత్ ఫుల్ సబ్జెక్టులను డీల్ చేసే హీరోలు కనిపించకపోవడంతో మన ప్రొడ్యూసర్లు, దర్శకులు సైతం ఆయనతోనే సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆయనకి బ్లాంక్ చెక్ ఇస్తున్నారట…ఇక ఇప్పటికే ఆయన రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తోంది…ఈ సినిమాలతో సైతం సక్సెస్ ని సాధిస్తే ఆయనకి ఇక తిరుగు ఉండదనే చెప్పాలి…