Atthi Satyanarayana : రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ని బంద్ చెయ్యాలి అనే ప్రతిపాదన ఇండస్ట్రీ మొత్తం పాకడం తో, ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చాలా తీవ్రంగా విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇక నుండి సినీ నిర్మాతలు ఎవరైనా సరే నేరుగా ప్రభుత్వాన్ని కలిసే సదుపాయాన్ని తొలగించాడు. టికెట్ రేట్స్ కావాలనుకునే వాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఆయన ఆదేశాలు జారీ చేసాడు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అన్నిట్లో పానీయాలు మరియు ఇతర ఫుడ్ కి సంబంధించిన క్వాలిటీ చెక్ ని నిర్వహించామని అధికారులను ఆదేశించాడు. అత్యధిక రేట్స్ తో అమ్ముతున్న థియేటర్స్ ఏవేవి ఉన్నాయో తనకు చెప్పాలని, ఇక మీదట వాటిపై ధరల నియంత్రణ ఉంటుందని చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
Also Read : అనిల్ రావిపూడి చిరంజీవి కి పోటీగా వస్తున్న దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రచ్చ రచ్చే…
ఇదంతా పక్కన పెడితే జూన్ 1 నుండి థియేటర్స్ ని బంద్ చెయ్యాలనే ప్రతిపాదన ముందుగా తీసుకొచ్చింది ఎవరు అనే అంశం పై విచారణ జరపాలని అధికారులను ఆయన ఆదేశించాడు. ఈ విచారణ లో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణ కూడా ఉన్నాడని గ్రహించి, నిజ నిజాలేంటో నిరూపణ అయ్యేవరకు జననసేన పార్టీ కి దూరంగా ఉండాల్సిందిగా ఆదేశించాడు. ఈ సందర్భంగా అత్తి సత్యనారాయణ నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన దిల్ రాజు పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘జూన్ 1 నుండి థియేటర్స్ ని బంద్ చెయ్యాలనే ఆలోచన చేసింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయం తో, తన సోదరుడిని కాపాడుకోవడానికి నాపై అభాండం వేసాడు. చెయ్యాల్సింది మొత్తం చేసి నిన్న ప్రెస్ మీట్ లో కమల్ హాసన్ ను మించిన ఆస్కార్ అవార్డు పెర్ఫార్మన్స్ ఇచ్చాడు దిల్ రాజు. నీచమైన ఉద్దేశ్యంతోనే దిల్ రాజు పేరు పైకి తీసాడు. పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వడం తో దిల్ రాజు తన రూట్ ని ఇలా మార్చాడు. నేను థియేటర్స్ బంద్ చేయాలనీ ఎక్కడా ప్రతిపాదించలేదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే అత్తి సత్యనారాయణ మాటలను జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మడం లేదు. ఎందుకంటే గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాని రీ రిలీజ్ చేసే రైట్స్ ని సొంతం చేసుకున్నాడు అత్తి సత్యనారాయణ. సినిమా విడుదలై భారీ వసూళ్లు వస్తే వచ్చిన గ్రాస్ లో కొంత భాగం జనసేన పార్టీ కి విరాళం గా అందిస్తాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టిన తర్వాత జనసేన పార్టీ కి ఒక్క పైసా కూడా ఆయన విరాళం అందించలేదు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈయన్ని నమ్మడం లేదు.
#DilRaju మీద సంచలన వ్యాక్యాలు చేసిన జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ.
జూన్ 1న థియేటర్ల బంద్ అని తొడ కొట్టి ప్రకటించింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి.
ఆయన తమ్ముడుని కాపాడుకోవడానికి దిల్ రాజు నాపై అభాండం వేశారు – అత్తి సత్యనారాయణ pic.twitter.com/aQOdJ0XFW9
— greatandhra (@greatandhranews) May 28, 2025