ఎంటర్టైన్మెంట్Aswani Dutt : ఉత్తమ గుండా ఉత్తమ రౌడీ... ఏపీ ప్రభుత్వం మీద అశ్వినీదత్ సీరియస్...

Aswani Dutt : ఉత్తమ గుండా ఉత్తమ రౌడీ… ఏపీ ప్రభుత్వం మీద అశ్వినీదత్ సీరియస్ కామెంట్స్!

Aswani Dutt : నిర్మాత అశ్వినీ దత్ వైసీపీ ప్రభుత్వం మీద మరోసారి తన అసహనం బయటపెట్టారు. ఏపీలో ప్రస్తుతం రౌడీ పాలన నడుస్తుందని పరోక్షంగా సెటైర్స్ వేశారు. విషయంలోకి వెళితే… సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పట్లో ఇది ట్రెండ్ సెట్టర్. భారతీయ సినిమా చరిత్రలో మొదటి కౌబాయ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ విడుదలై యాభై ఏళ్ళు దాటిపోతుంది. మే 31న కృష్ణ జయంతి. ఈ సందర్భంగా మోసగాళ్లను మోసగాడు రీరిలీజ్ చేయాలని నిర్మాత ఆదిశేషగిరి రావు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ, బి గోపాల్ హాజరయ్యారు. ఓ విలేకరి రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డ్స్ ఇవ్వడం ఆపేశాయి. దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా… అశ్వినీదత్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తుంది. ఇప్పుడంతా ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తారు. రెండు మూడేళ్ళలో మరలా నంది అవార్డులు ఇచ్చే సీజన్ వస్తుంది, అన్నారు.

వైసీపీ గవర్నమెంట్ లో రౌడీ పాలన నడుస్తుంది. వాళ్లు సినిమా అవార్డ్స్ ఇవ్వడం వంటి మంచి పనులు చేయరు. ఈసారి ప్రభుత్వం మారుతుంది. అప్పుడు నంది అవార్డ్స్ ఇస్తారు.. అని ఎద్దేవా చేశారు. చెప్పాలంటే ఆయన టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. అశ్వినీదత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ డై హార్డ్ ఫ్యాన్. సందర్భం రావడంతో ఆయన వైసీపీకి చురకలు అంటించారు. అందులోనూ వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య అనేక విబేధాలు నెలకొన్నాయి. టికెట్స్ ధరల విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగింది.

ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన పోసాని కృష్ణమురళి ఇటీవల నంది అవార్డ్స్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి ఒక కులం కోసం ఏర్పాటు చేసుకున్న అవార్డ్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక అశ్వినీదత్ తాజా కామెంట్స్ పై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ప్రస్తుతం అశ్వినీ దత్ ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Ashwini Dutt : అశ్వినీదత్ తేజ సజ్జకి 6 కోట్లు ఇవ్వాలా..? ఎందుకివ్వడం లేదంటే..?

Ashwini Dutt : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి యంగ్ హీరోగా ఇండస్ట్రీలో...

Jagan Suggestion on Amaravati : 500 ఎకరాల్లో రాజధాని..అట్లుంటది జగన్ స్టాండ్!

Jagan Suggestion on Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారలేదా? ప్రజలు తిరస్కరించినా జగన్ అర్థం చేసుకోవడం లేదా? ఆ పార్టీ మరోసారి అబాసుపాలు కావడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version