https://oktelugu.com/

Rashmika Mandanna: స్పెషల్ సాంగ్ కి సై.. విజయ్ దేవరకొండ కోసమేనా ?

Rashmika Mandanna: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ‘జన గణ మన’ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ ను రష్మిక మందన్నా చేయనుంది. ఇప్పటికే ఆమెకు పూరి కథ కూడా చెప్పాడు. రష్మిక మందన్నా కూడా ‘జన గణ మన’లోని స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. మొత్తానికి రష్మిక మందన్నా కూడా స్పెషల్ సాంగ్ కి సై […]

Written By:
  • Shiva
  • , Updated On : July 4, 2022 / 08:09 PM IST
    Follow us on

    Rashmika Mandanna: స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ‘జన గణ మన’ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ ను రష్మిక మందన్నా చేయనుంది. ఇప్పటికే ఆమెకు పూరి కథ కూడా చెప్పాడు. రష్మిక మందన్నా కూడా ‘జన గణ మన’లోని స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. మొత్తానికి రష్మిక మందన్నా కూడా స్పెషల్ సాంగ్ కి సై అంటుంది.

    Vijay Devarakonda – Rashmika Mandanna

    ఇక ఈ సినిమాలో విజయ్ కి హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు కియారా అద్వానీ దగ్గరకు వెళ్లాయి. ఈ పుకార్లను నమ్మకండి’ అంటూ క్లారిటీ ఇచ్చింది కియారా. ఆ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ‘జన గణ మన’ సినిమాలో నటించనున్నట్లు టాక్ నడిచింది.

    Also Read: Bunny Vasu- Rashmika Mandanna: అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు బతిమిలాడుతున్నాడు

    కానీ జాన్వీ కపూర్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేను ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాను ఓకే చేయ‌లేదు. ఒక‌వేళ ఏదైనా సినిమాకు సంత‌కం చేస్తే తప్పకుండా చెప్తాను’ అని తెలిపింది. మొత్తానికి ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా నటించడం లేదు అని తేలిపోయింది. మరి ఈ సినిమాలో ఏ హీరోయిన్ నటిస్తోందో గానీ..రోజుకొక రూమర్ అయితే వినిపిస్తూనే ఉంది.

    ఈ ‘జన గణ మన’ సినిమాను కాశ్మీర్ నేపథ్యంగా తీస్తున్నాడు పూరి. అంటే, సినిమా మొత్తం కాశ్మీర్ లో ఉండదు. కొంత భాగం అక్కడ ఉంటుంది. ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని.. విజయ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. కథలో మెయిన్ పాయింట్ విషయానికి వస్తే.. కాశ్మీర్ లో ప్రేమలో పడి, అక్కడే పెళ్లి చేసుకుంటాడట హీరో.

    Vijay Devarakonda – Rashmika Mandanna

    అయితే.. ఆ యువతి పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. మరోపక్క తన పాత్ర కోసం ఇప్పటికే మిలిటరీ కటింగ్ చేయించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ ‘జనగణమన’ నుంచి వచ్చిన పోస్టర్ చాలా బాగుంది. పోస్టర్ వ్యూ అండ్ కలర్ టోన్ అండ్ మూవీ కాన్సెప్ట్ తాలూకు విజువల్ సెన్స్ బాగున్నాయి.

    పైగా భయంకరమైన యుద్ధ వాతావరణంలో శత్రువులను అంతమొందించేందుకు నింగి నుంచి భారత సైనికులు నేలకు దూకుతున్న దృశ్యాలతో తొలి పోస్టర్ ను డిజైన్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

    Also Read:Kalyan Ram – Bimbisara Trailer Talk: ‘బింబిసార’ ట్రైలర్ టాక్ : కళ్యాణ్ రామ్ నెత్తుటి విన్యాసాలు.. విజువల్స్ కేక

    Tags