Venu Swamy
Venu Swamy: కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. ఈ అమ్మడు టాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా ఇదే రేంజ్ లో పేరు సంపాదించుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ కూడా ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.ఇక రీసెంట్ గా విడుదలైన అన్పపూరణి సినిమా ఎన్నో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. కానీ ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాపై పలువురు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
పెళ్లి తర్వాత నయనతార పలు వివాదాల్లో నిలుస్తోంది. సరోగసి ద్వారా పిల్లలను కనడం, ఎల్. ఐ. సీ అనే సినిమా ద్వారా కూడా వివాదాల్లో నిలవడం, ప్రస్తుతం ఈ సినిమా కూడా వివాదాల పాలు కావడం చూస్తుంటే కొందరికి అనుమానాలు కలుగుతున్నాయట. అయితే ఎల్.ఐ.సి సినిమా వల్ల జీవిత బీమా సంస్థ నుంచి విఘ్నేష్ శివన్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అన్నపూరణి అనే సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఈ సినిమా కోర్టు వరకు వెళ్లింది. అయితే గతంలోనే వేణు స్వామి నయనతారకు పెళ్లి తర్వాత కలిసి రాదని కామెంట్లు చేశారు.
వేణు స్వామి చెప్పినట్టుగానే నయనకు పెళ్లి తర్వాత వివాదాలు ఎక్కువ అయ్యాయి. చివరకు ఈమె సినిమా కోర్టు వరకు కూడా వెళ్లింది. దీంతో వేణు స్వామి చెప్పిన విషయాలే నిజం అవుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే 2024 తర్వాత సినీ కెరీర్ క్లోజ్ అవుతుందన్నారు వేణు స్వామి. మరి ఈ మాటలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి. ఇక నయనతార పారితోషికం ఏకంగా రూ. 10 కోట్లు. రాబోయే రోజుల్లో ఈమె సినిమాలు మరింత రికార్డులు సృష్టిస్తే.. హీరోయిన్ ల పారితోషికం కూడా భారీగానే ఉంటుందనే టాక్ కు ఈమెనే నిదర్శనంగా నిలుస్తుందేమో.. ప్రస్తుతం రూ. 10 కోట్లు అందుకుంటున్న నయన తన పారితోషికం మరింత పెంచే అవకాశం కూడా ఉంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
View Author's Full InfoWeb Title: As venu swamy said nayantara had more disputes after marriage