Arya 2 Re Release: ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పీఆర్ టీం ‘ఆర్య 2′(Aarya 2 Movie) చిత్రాన్ని నేడు గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ సినిమాలు పాటలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి, రీ రిలీజ్ లో వర్కౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే రీ రిలీజ్ లో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్ టైం రికార్డు గ్రాస్ అయితే ఎక్కడా రాలేదు కానీ, రీసెంట్ గా విడుదలైన ‘సలార్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చిత్రాలకంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అడ్వాన్స్ సేల్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోయినా, నేడు కౌంటర్ బుకింగ్స్ లో మాత్రం ఈ సినిమా దంచి కొట్టేసింది. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈ చిత్రానికి సాయంత్రం నుండి అదనపు షోస్ ని కూడా షెడ్యూల్ చేశారు.
Also Read: మరగుజ్జుగా కనిపించబోతున్న రామ్ చరణ్..అభిమానులు తట్టుకోగలరా!
ఈ షోస్ యాడ్ చేసిన వెంటనే క్షణాల్లో హౌస్ ఫుల్స్ అవ్వడం విశేషం. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో షెడ్యూల్ చేసిన షోస్ అన్ని హౌస్ ఫుల్స్ అయ్యాయి. పుష్ప ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకొని భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రానికి మొదటి రోజు మూడు కోట్ల 53 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం నైజాం ప్రాంతం నుండే కోటి 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ‘సలార్'(Salaar Movie) రీ రిలీజ్ కి మొదటి రోజు ఇండియా వైడ్ గా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే లాంగ్ రన్ లో ఈ చిత్రం సలార్ ని కొట్టే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఎందుకంటే సలార్ కి వీకెండ్ బాగా కలిసొచ్చింది. కానీ ఇక్కడ ‘ఆర్య 2’ కి కేవలం రెండు రోజులు మాత్రమే కలిసొచ్చింది. కాబట్టి క్లోజింగ్ కలెక్షన్ నాలుగు కోట్ల రూపాయిల వద్దనే ఆగిపోవచ్చు. రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్నంత రేంజ్ లో లేవు. కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మాత్రమే హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. రేపు ఇండియా వైడ్ గా 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రీ రిలీజ్ చిత్రాలలో ఇప్పటికీ టాప్ 1 గా ‘గబ్బర్ సింగ్’ చిత్రమే కొనసాగుతుంది. ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఉండడం వల్ల కాస్త తగ్గింది కానీ, లేకపోతే ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల నుండి పది కోట్ల గ్రాస్ ని రాబట్టేదని అంటున్నారు.