Aditya 369 Re Release: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ సినిమాలలో ఒకటి ‘ఆదిత్య 369′(Aditya 369 ReRelease). కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలి డ్రామాస్, మాస్ మూవీస్ ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో, ‘టైం మెషిన్’ లాంటి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథతో సినిమా రావడం అనేది అప్పట్లో ఒక అద్భుతం. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అంటూ అప్పటి విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. ఇండియా లో ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన మొట్టమొదటి ఇండియన్ చిత్రం ఇదే. సింగీతం శ్రీనివాస రావు ని అప్పట్లో మెచ్చుకోని వాళ్లంటూ ఎవ్వరూ లేరు. అలాంటి క్లాసిక్ ని లేటెస్ట్ 4K టెక్నాలజీ తో అప్డేట్ చేసి రీ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసుకుంటుదని అందరూ అనుకున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు.
Also Read: మరగుజ్జుగా కనిపించబోతున్న రామ్ చరణ్..అభిమానులు తట్టుకోగలరా!
రెస్పాన్ దారుణంగా వచ్చింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి బాలయ్య(Nandamuri Balakrishna) తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆ ఈవెంట్ లో పాల్గొని ఈ చిత్రం తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నారు. సోషల్ మీడియా లో కూడా ఈ సినిమాకు ప్రొమోషన్స్ భారీగానే చేసారు. కానీ రెస్పాన్స్ మాత్రం దారుణంగా వచ్చింది. ఇప్పటి వరకు రీ రిలీజ్ హిస్టరీ లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనంటూ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 9 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. నందమూరి అభిమానులు కూడా ఈ సినిమాని పట్టించుకోకపోవడం గమనార్హం. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ కి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రొమోషన్స్ కోసం దాదాపుగా కోటి రూపాయిల వరకు ఖర్చు చేసారు.
కనీసం ఆ ఖర్చులు అయినా ఏ రీ రిలీజ్ లో రీకవర్ చేసుంటే బాగుండేది. కనీసం లాంగ్ రన్ లో అయినా కాస్త పరువు కాపాడుతుందో లేదో చూద్దాం. అయితే ఈమధ్య కాలం లో యూత్ ఆడియన్స్ సాంగ్స్ అద్భుతంగా ఉండే సినిమాలను మాత్రమే రీ రిలీజ్ ట్రెండ్ లో థియేటర్స్ కి కదులుతున్నారు. రీసెంట్ గా అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. నేడు ఈ చిత్రం తో పాటు అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘ఆర్య 2 ‘(Aarya 2 Re Release) లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ విడుదల అవ్వడం వల్లే అని అంటున్నారు విశ్లేషకులు. ఆ సినిమా మేనియా లో ఎవ్వరూ ఆదిత్య 369 ని గుర్తించలేదని, ఫలితంగా ఈ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ వేల్యూ ఉన్న సినిమాకు ఘోరమైన అవమానం జరిగిందని అంటున్నారు. ఇందులో కూడా లాజిక్ ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.