https://oktelugu.com/

Salman Khan: దేశ వ్యాప్తంగా “సల్మాన్ టాకీస్” ల ఏర్పాటుకు రంగం సిద్దం చేసిన… సల్మాన్ ఖాన్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తనదైన నటనతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు సల్మాన్. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం “అంతిమ్”. ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు సల్మాన్. నటుడిగా, నిర్మాతగా పని చేయడమే కాకుండా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘సల్మాన్ టాకీస్’ ప్రారంభించేందుకు కూడా ఈ స్టార్ హీరో సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఒక ఛానల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 08:27 PM IST
    Follow us on

    Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తనదైన నటనతో బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు సల్మాన్. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం “అంతిమ్”. ఈ మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు సల్మాన్. నటుడిగా, నిర్మాతగా పని చేయడమే కాకుండా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ‘సల్మాన్ టాకీస్’ ప్రారంభించేందుకు కూడా ఈ స్టార్ హీరో సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా సల్మాన్‌ ఖాన్‌ ఈ టాకీస్ ఏర్పాట్ల గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.

    నా అభిమానుల కోసం వీలైనంత త్వరగా ‘సల్మాన్ టాకీస్’ ఓపెన్‌ చేయాలనుకుంటున్నాను. అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నా అని సల్మాన్ చెప్పాడు. కరోనా కారణంగా పనులు నిలిపివేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ పనులు జరుగుతున్నాయి అన్నారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇది ఓపెన్‌ అవుతుంది అని చెప్పారు. థియేటర్లు లేని గ్రామీణ, చిన్న పట్టణాల్లో సల్మాన్ థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ చాలా మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కలిసారని వెల్లడించారు. మొదటిగా ఈ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ థియేటర్లలో పిల్లలకు, నిరుపేదలకు ఉచితంగా చూసే వెసులు బాటు ఉంటుందని కూడా సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.