https://oktelugu.com/

తనకు ప్రాణ హాని ఉందంటున్న అర్జున్ రెడ్డి నటి

ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీసుధ తనకు ప్రాణ హాని ఉందంటూ కేసు పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కె నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసి ఉన్నాక మోసం చేశాడంటూ గతేడాది ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు శ్యామ్‌ కె నాయుడు నకిలీ పత్రాలు సృష్టించినా పోలీసులు ఇంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదని ఎస్సార్‌‌నగర్ […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 02:53 PM IST
    Follow us on


    ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీసుధ తనకు ప్రాణ హాని ఉందంటూ కేసు పెట్టటం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌ కె నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసి ఉన్నాక మోసం చేశాడంటూ గతేడాది ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాను రాజీ కుదుర్చుకున్నట్లు శ్యామ్‌ కె నాయుడు నకిలీ పత్రాలు సృష్టించినా పోలీసులు ఇంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదని ఎస్సార్‌‌నగర్ పోలీసులకు ఆమె మళ్లీ ఫిర్యాదు చేశారు.

    Also Read: శ‌ర్వానంద్ తో పోటీకి సిద్దమవుతున్న శ్రీ‌విష్ణు !

    గ‌తంలో త‌ను పెట్టిన కేసుని ఉప‌సంహ‌రించుకోవాల‌ని త‌న‌పై ఒత్త‌డి తెస్తున్నాడ‌ని, త‌న‌కు ప్రాణ హాని వుందంటూ ఆమె పేర్కొంది. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తాను రాజీకి ఒప్పుకోక పోవడంతో దాడులు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.

    Also Read: ఈ వీక్ టాలీవుడ్ ట్రేడ్ టాక్

    తాను శ్యామ్ కె. నాయుడుపై పెట్టిన కేసుని ఉప‌సంహ‌రించుకోవాల‌ని ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ సాయిరాం మాగంటి బెదిరించార‌ని, అంతే కాకుండా గ‌తేడాది ఆగ‌స్టు 5న ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా ఇంటికి పిలిపించి అక్క‌డ త‌న‌ని స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్ సాయిరాం మాగంటి, శ్యామ్ కె. నాయుడు బెదిరించ‌డ‌మే కాకుండా శారీర‌కంగా దాడికి పాల్ప‌డ్డార‌ని శ్రీ‌సుధ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ విషయంలో పోలీసులు సహకరించి తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్