Nagababu Interesting Comments: నా తమ్ముడు పవన్ అటువంటి వాడు కాదు.. ఎంపీగా పోటీచేయడంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు…!

Nagababu Interesting Comments: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టినపుడు ఆయనకు వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేసిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నాగబాబు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. తాజాగా పవన్ కల్యాణ్ పార్టీ గురించి, తను ఎంపీగా పోటీ చేయడానికి ఏర్పడిన పరిస్థితుల గురించి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ […]

Written By: Mallesh, Updated On : January 30, 2022 3:23 pm
Follow us on

Nagababu Interesting Comments: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టినపుడు ఆయనకు వ్యక్తిగతంగా మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేసిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నాగబాబు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. తాజాగా పవన్ కల్యాణ్ పార్టీ గురించి, తను ఎంపీగా పోటీ చేయడానికి ఏర్పడిన పరిస్థితుల గురించి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nagababu Interesting Comments

పవన్ కల్యాణ్ మెగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి మద్దతు ఉన్నా లేకపోయినా ఒంటరిగానే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే తాను గత ఎన్నికల్లో తన తమ్ముడు మీ లాంటి వాళ్లు ఉంటే బాగుంటుందని అన్నాడని, అలా పవన్ అన్నాడనే తాను ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చిందని నాగబాబు తెలిపాడు. ఇకపోతే తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అభిమానులు కోరుకుంటే స్థాపించాడని గుర్తు చేశాడు. అయితే, తన తమ్ముడు పవన్ కల్యాణ్ అభిమానులు కోరుకుంటే రాజకీయాల్లోకి రాలేదని, నిస్వార్థంగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాడని వివరించాడు. తన తమ్ముడు పవన్ చిరంజీవి లాంటి వాడు కాదని, అభిమానులు కోరితే ఆయన రాజకీయాల్లోకి రాలేదని, తన నిర్ణయం మేరకే పాలిటిక్స్ లోకి వచ్చాడని పేర్కొన్నాడు.

Also Read: Pawan kalyan: పవన్ నిర్ణయమే వాళ్లకు పెద్ద కండీషన్ !

పవన్ కల్యాణ్ ఆలోచన చిరంజీవి, తన ఆలోచనలకు చాలా భిన్నంగా ఉంటాయని నాగబాబు చెప్పుకొచ్చారు. తాను గెలిచినా, ఓడినా నిజాయితీగా రాజకీయాలు చేయగలిగే సత్తా తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఉందని ఈ సందర్భంగా నాగబాబు అన్నాడు. ఇకపోతే పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ఆయన ప్రభావం చూపగలుగుతాడు అనే చర్చ అయితే ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి జనసేనాని ప్లాన్స్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయం రెండూ.. చేస్తున్నాడు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ తన అభిమానులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడనే కాదనలేని వాస్తవం. కాగా, గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా, పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ ప్రణాళికలు రచించుకుంటున్నారని జనసేన పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan In AP Politics: ఏపీలో పవన్ కళ్యాణ్ బలం ఎంత?

Tags