Heroes : సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడు కూడా సినిమాలో హీరో ఎవరు అనేది తెలుసుకొని మాత్రమే సినిమా చూడడానికి వస్తారు తప్ప డైరెక్టర్ ఎవరు అనేది తెలుసుకొని సినిమాలకు రారు…స్టార్ హీరోలకు భారీ క్రేజ్ అయితే ఉంటుంది మరి ఆ క్రేజ్ ను వాడుకొని వాళ్ళు రెమ్యునరేషన్స్ ను భారీ రేంజ్ లో తీసుకుంటున్నారు. ఒక సినిమా బడ్జెట్ అనేది భారీ రేంజ్ లో పెరిగిపోతుంది అంటే దానికి కారణం హీరో అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో హీరోలు వందల కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ అనేది ఈజీగా 500 కోట్ల వరకు పెరుగుతుంది. మరి అలా కాకుండా కొంతమంది హీరోలు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దగ్గర నుంచి సిద్దు జొన్నలగడ్డ లాంటి యంగ్ హీరో వరకు ప్రతి ఒక్కరు లాభాల్లో వాటా తీసుకోవడం అనేది జరుగుతుంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు దాదాపు 30% వరకి ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ లాంటి స్టార్ హీరో సైతం తను చేస్తున్న జాక్ (Jack) సినిమా నైజాం రైట్స్ ని చాలా తక్కువ ధరకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : స్టార్ హీరోలు గడ్డం పెంచితే సినిమా సూపర్ హిట్ అవుతుందా..?
మరి దీని వల్ల ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకపోయినా కూడా అందులో వచ్చే ప్రాఫిట్స్ తోనే తన రెమ్యునషన్స్ కవర్ చేయాలని చూస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ లాంటి హీరోలు సైతం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సందర్భంలో ఆయన కూడా లాభాల్లో వాట తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇప్పుడు అట్లీ తో చేస్తున్న సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికి సినిమా బడ్జెట్ ఎక్కువగా పెరిగిపోతే మాత్రం ఆయన లాభాల్లో వాటా తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండాలి అంటే హీరోలు ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటే పర్లేదు.
లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అయితే భారీ రేంజ్ లో ప్రొడ్యూసర్లు నష్టపోయే అవకాశాలైతే ఉంటాయి. ఇండస్ట్రీ భారీ రేంజ్ లో ముందుకు దూసుకెళ్ళాలన్న లేదంటే ఢీలా పడాలన్న కూడా అది హీరోల చేతుల్లోనే ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది…
Also Read : ఈ 25 సంవత్సరాల్లో మన స్టార్ హీరోలు సాధించిన ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవే…