AP BJP: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలను మరోసారి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి ప్రయత్నించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీ నుంచి పెద్ద ఎత్తున రాజకీయ ఫిర్యాదులు వెళుతున్నాయి. ఇప్పటికే గత వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, మద్యంలో దోచేసారని, విదేశాలకు హవాలా ద్వారా పంపించేసారని టిడిపి సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంది బిజెపి. ఇప్పుడు కూడా ఆ పార్టీకి అదే ఛాన్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!
* తెర వెనుక అప్పట్లో..
2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో టిడిపి కూడా కీలక భాగస్వామి. అయితే అప్పట్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది బిజెపి. మిత్రుల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పట్లో ఏపీలో గౌరవప్రదమైన సీట్లతో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే టిడిపి తోక జాడించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తన లైన్లోకి తెచ్చుకుంది బిజెపి. ఇది నచ్చని టిడిపి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పటినుంచి అంతర్గత స్నేహితుడిగా కొనసాగుతూ వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు, తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైంది భారతీయ జనతా పార్టీ.
* బిజెపికి వైసీపీ ఎంపీల సహకారం..
2019 ఎన్నికల్లో ఏపీలో ఒక్క అసెంబ్లీ సీట్లు రాలేదు. ఒక్క ఎంపీ సీటు కూడా పొందలేదు. కానీ రాజకీయంగా ప్రభావం చూపింది భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party ). తెలుగుదేశం పార్టీ పై ఉన్న కోపంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చేరదీసింది కేంద్రంలోని బిజెపి. గత ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 22 మంది ఎంపీలు బిజెపికి చాలా రకాలుగా సహకరించారు. అన్ని రకాల బిల్లుల ఆమోదానికి పనికి వచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్ డి ఏ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరలేదు కానీ.. అంతకుమించి అన్నట్టు వ్యవహరించింది. అయితే రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా లబ్ధి పొందింది బిజెపి.
* కేంద్రం దృష్టికి..
అయితే ఇప్పుడు మరోసారి బిజెపి పొలిటికల్ గేమ్( political game) ఆడే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డి పై రివెంజ్ ప్రయత్నిస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి భారీ మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. 90 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే దాదాపు 32 వేల కోట్ల అవినీతి జరిగిందని చెబుతోంది. హవాలా మార్గం గుండా 4వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి దేశాన్ని దాటించేసారని టిడిపి లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి భద్రతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఇలా పరస్పరం రాజకీయ ఫిర్యాదులు చేసుకోవడంతో బిజెపి మరోసారి అవకాశం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: మందుబాబులకు షాక్.. రేపు వైన్ షాపులు బంద్!