Baahubali Re-Release Details: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ప్రభాస్ (Prabhas) తో చేసిన బాహుబలి (Bahubali) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా రెండు పార్టులుగా రావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అయితే నిన్నటికీ బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇక బాహుబలి రెండు పార్టులుగా కలిపితే 5 గంటల 27 నిమిషాల నిడివి వస్తుందని ఈ రెండు పార్టులను కలిపి చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలియజేశారు. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్లు మాత్రం 5 గంటల 27 నిమిషాలు ఒక్క సినిమా మీద కేటాయించడం అంటే మామూలు విషయం కాదు అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక దీనికి కూడా స్పందించిన సినిమా యూనిట్ మేము మీ రోజంతా తీసుకోవడం లేదు. కేవలం ఒక ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి ఎంత సమయం అయితే కేటాయిస్తారో అంత సమయం మా సినిమా మీద కేటాయిస్తే సరిపోతుంది అంటూ ట్వీట్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కింది. కాబట్టి 5 గంటల 27 నిమిషాలు ఈ సినిమాని చూసిన కూడా ఎక్కడా బోర్ కొట్టదు. సగటు ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతూ ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారని సినిమా మేకర్స్ చాలా మంచి కాన్ఫిడెంట్ ను అయితే వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒక నటుడు స్టార్ హీరో అవ్వాలంటే ఏం చెయ్యాలి… వాళ్ల మూవీ ఎలాంటి సక్సెస్ ను సాధించాలి…
మరి రాజమౌళి విజువల్ వండర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన త్రిబుల్ ఆర్(RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరును మారుమ్రోగిపోయేలా చేశాడు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని అభిమానులను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…
రాజమౌళి ఏది చేసినా కూడా అదొక సంచలనంగా నిలుస్తోంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఆయన మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…