Actor become a star Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఇక యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన సక్సెస్ లను సాధించడంలో తీవ్రంగా వెనకబడి పోతున్నారు. స్టార్ హీరో రేంజ్ ను సాధించలేకపోతున్నారు. ఇక నితిన్ (Nithin) ను దీనికి ఉదాహరణ గా తీసుకోవచ్చు…ఆయన ఇప్పటికి స్టార్ హీరోగా మారలేదు అంటే ఆయన చేసిన సినిమాలు అతన్ని వెనక్కి లాగుతున్నాయనే చెప్పాలి. తన తోటి హీరోలందరు స్టార్ హీరోలుగా మారడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటే, ఈయన మాత్రం ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. నిజానికి ఒక హీరో స్టార్ హీరో అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరులో మెదులుతోంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే ఒక మీడియం రేంజ్ హీరో స్టార్ హీరోగా ఎదుగుతాడు.
అలా కాకుండా ఎన్ని సినిమాలు చేసిన కూడా అతను హీరోగా కొనసాగుతాడు. తప్ప స్టార్ హీరోగా మారలేడు. ఇక హీరోకి, స్టార్ హీరోకి మధ్య ఉన్న తేడా ఏంటి? అంటే స్టార్ హీరో సినిమాలు ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ అయితే భారీ రేంజ్ లో వస్తుంటాయి. టాక్ తెలిసేలోపే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టి ముందుకు సాగుతాయి.
Also Read: చంపేస్తాడు.. ప్రభాస్ తో అట్లుంటదీ.. బయటపెట్టిన సంజయ్ దత్…
కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలు అలా కాదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు. ఒకవేళ ప్లాప్ టాక్ వస్తే మాత్రం వాళ్ల సినిమా చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించారు… స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా కనీసం ఒక్కసారైనా చూడొచ్చు అనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు.
తద్వారా వాళ్ళ సినిమాలకి కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే హీరోకి స్టార్ హీరోకి మధ్య చాలా తేడాలైతే ఉంటాయి. మరి ప్రతి ఒక్క హీరో స్టార్ హీరోగా మారాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ దానికి సంబంధించినట్టుగా సక్సెస్ లను సాధించడంలో మాత్రం తీవ్రంగా వెనుకబడిపోతూ ఉంటారు…