https://oktelugu.com/

Venkatesh and Mahesh Babu : వెంకటేష్ కొడుకు అర్జున్, మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇద్దరు కలిసి ఒకే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 28, 2024 / 03:42 PM IST

    Venkatesh , Mahesh Babu

    Follow us on

    Venkatesh and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒక్కసారి స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోలందరూ వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…

    సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళ వారసులను కూడా స్టార్ హీరోలుగా మార్చడానికి ఇప్పుడున్న హీరోలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ కొడుకు అయిన అర్జున్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న వెంకటేష్ తన కొడుకు గురించి చెబుతూ తను సినిమాల్లోకి రావడానికి ఇంకా కొంచెం సమయం తీసుకునే అవకాశాలైతే ఉన్నాయంటు చెప్పాడు. ఇక అలాగే మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ కూడా రావడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చదువుకుంటున్నప్పటికి తనకు యాక్టింగ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొదటి సినిమాలోనే ఇటు గౌతమ్, అటు అర్జున్ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వెంకటేష్ మహేష్ బాబు ఇద్దరు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో వీళ్ళిద్దరి చేతుల మీదగానే ఆడియో ఫంక్షన్ చేశారు. అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి సినిమా ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవ్వాలని చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరిని ఒకే సినిమాలో పరిచయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇటు మహేష్ బాబు అటు వెంకటేష్ ఇద్దరూ ప్లాన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి ఇది కనుక వర్కౌట్ అయితే రెండు పెద్ద ఫ్యామిలీలకు సంబంధించిన స్టార్ హీరోలు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం వీళ్ళిద్దరూ ఒకే సినిమాతో ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు.

    మరి వీళ్ళిద్దరి సినిమాని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు చాలా మంచి టాలెంటెడ్ తో మంచి సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక వీళ్ళతో సినిమాలు చేసి ఇద్దరికి మంచి సక్సెస్ ని అందించగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడి కోసమే అటు వెంకటేష్ ఇటు మహేష్ బాబు వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది…

    ఇక వీళ్లిద్దరూ కలిసి ఇండస్ట్రీ కి పరిచయం అవ్వడం వల్ల ఇదొక మంచి రికార్డుగా ఇండస్ట్రీలో నిలవడమే కాకుండా ఇటు దగుపాటి ఫ్యామిలీకి, అటు ఘట్టమనేని ఫ్యామిలీకి మధ్య ఉన్న బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది…