Venkatesh- Kamal Haasan: కమలహాసన్ సినిమాకు దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేష్? ఏ సినిమా? ఎప్పుడు?

వెంకటేష్ ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే మనకు పరిచయం కానీ ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించారని మీకు తెలుసా. అది కూడా కమల్ హాసన్ లాంటి లెజెండ్ నటించిన సినిమాకు దర్శకత్వం వహించారు.

Written By: Suresh, Updated On : November 25, 2023 11:48 am

Venkatesh- Kamal Haasan

Follow us on

Venkatesh- Kamal Haasan: టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక మంచి నటుడిగా మాత్రమే కాదు గొప్ప వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు వెంకీ. ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి అభిమాని ఉంటారు. కానీ వెంకటేష్ తన అభిమానులను మాత్రమే కాదు ఇతర హీరోల అభిమానులను కూడా గౌరవిస్తారు. కామెడీ, సెంటిమెంట్, మాస్, యాక్షన్ ఇలా ఏ జానర్ లో తీసుకున్నా కూడా వెంకీకి సూపర్ హిట్ లు ఉన్నాయి.

తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఫ్యామిలీ హీరో ఎవరంటే ముందుగా వెంకీ మామ పేరే చెబుతారు. ఈయన సినిమా విడుదల అవుతుందంటే.. యూత్ మాత్రమే కాదు ఇంటిల్లిపాది కలిసి వెళుతుంటారు. వెంకీ సినిమానా.. కచ్చితంగా వెళ్ళవచ్చు అనుమానమే లేదు అంటారు. ఇలా ఫ్యామిలీ మొత్తం తో కలిసి థియేటర్ల ముందు క్యూ కడుతుంటారు. ఇప్పటికీ కూడా ఏ హీరోకి అయినా మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వచ్చిందంటే వెంకటేష్ తో పోల్చి చూస్తుంటారు. తెలుగు ఆడియన్స్ లో ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది.

వెంకటేష్ ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే మనకు పరిచయం కానీ ఆయన ఓ సినిమాకు దర్శకత్వం వహించారని మీకు తెలుసా. అది కూడా కమల్ హాసన్ లాంటి లెజెండ్ నటించిన సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే 2009వ సంవత్సరంలో కమల్ హాసన్, వెంకీ కాంబోలో ఈనాడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైనా.. కమర్షియల్ గా ఫ్లాప్ ను మూటగట్టుకుంది. కథ మొత్తం ఒకే పాయింట్ మీద తిరగడంతో ఆడియన్స్ పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు.

ఈ సినిమాకు చక్రి తోలేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలీవుడ్ లో చక్రి కి మరో సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. ఒక షెడ్యూల్ మొత్తానికి ఆయన దర్శకత్వం వహించలేకపోయాడు. కమల్ హాసన్ డేట్స్ కూడా ఆ షెడ్యూల్ కి అందుబాటులో లేవు. దీంతో వెంకటేష్ ఆ షెడ్యూల్ లో కేవలం తాను ఉన్న సన్నివేశాలను ప్లాన్ చేసి, వాటికి ఆయనే దర్శకత్వం వహించారు. అలా దాదాపుగా రెండు వారాల షూటింగ్ కేవలం వెంకటేష్ దర్శకత్వంలోనే జరగడం గమనార్హం. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. రెండింటిలోనూ కమల్ హాసన్ నటించారు. కానీ తమిళంలో వెంకటేష్ పాత్రని మోహన్ లాల్ చేశారు.