Mahesh Babu : సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు(Mahesh Babu) తన తండ్రి అయిన కృష్ణ గారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు కొడుకు అయిన గౌతమ్ కృష్ణ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.
Also Read : విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!
అయితే ఈయన చేస్తున్న మొదటి సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే రాజకుమారుడు (Rajakumarudu) సినిమాలో మహేష్ బాబుకు తండ్రిగా కృష్ణ నటించాడు. తద్వారా ఆ సినిమా సక్సెస్ అవ్వడమే కాకుండా మహేష్ బాబు కెరియర్ కూడా చాలా వరకు బిల్డ్ అయింనే చెప్పాలి అలాగే ఆయన స్టార్ హీరోగా మారిపోయాడు.
తన మొదటి సినిమాలో వాళ్ల నాన్న అయిన కృష్ణ గారు నటించడం వల్లే మహేష్ బాబు అంత పెద్ద స్టార్ గా ఎదిగానని నమ్ముతున్నాడు. కాబట్టి తన కొడుకు అయిన గౌతమ్ కృష్ణ సినిమాలో తను కూడా ఒక క్యారెక్టర్ చేయాలని చూస్తున్నారట. మరి అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నాడు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఆయన ఫారన్ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గౌతమ్ సైతం భారీ సక్సెస్ ని సాధిస్తు ముందుకు దూసుకెళ్తే మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ మూడోవ తరం హీరోలు కూడా భారీ విజయాలను సాధిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన కొడుకు కూడా సినిమాల్లోకి రానున్న నేపధ్యంలో మహేష్ బాబు భారీ విజయాలను సాధించి ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి రాబోయే రోజుల్లో తండ్రి కొడుకులు ఎలాంటి సినిమాలు చేస్తారు.. ఎంత పెద్ద సక్సెస్ లను సాధిస్తారు అనేది…