Mahesh Babu: మహేష్ బాబు కి రెండో సినిమా తో డిజాస్టర్ లను ఇచ్చిన దర్శకులు వీళ్లేనా..?

మొదటగా ఒక్కడు సినిమాతో మహేష్ బాబు అదిరిపోయే హిట్టిచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆ సినిమా మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దాంతో మహేష్ బాబు గుణశేఖర్ కి అర్జున్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.

Written By: Gopi, Updated On : January 18, 2024 10:06 am

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కొంతమంది దర్శకులు అతనికి వరుసగా మంచి విజయాలను ఇస్తే, మరి కొంతమంది మాత్రం ఫ్లాప్ సినిమాలను కూడా ఇచ్చారు. అయితే ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన తర్వాత అదే నమ్మకంతో మహేష్ బాబు వాళ్లకి ఇంకొక సినిమా కూడా ఇచ్చాడు. కానీ అందులో చాలామంది దర్శకులు రెండోసారి మహేష్ బాబుకు ప్లాప్ సినిమాలను ఇచ్చారు. వాళ్ళెవరో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మొదటగా ఒక్కడు సినిమాతో మహేష్ బాబు అదిరిపోయే హిట్టిచ్చిన దర్శకుడు గుణశేఖర్. ఆ సినిమా మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దాంతో మహేష్ బాబు గుణశేఖర్ కి అర్జున్ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక వీళ్ళ కాంబో లో మూడో సినిమాగా వచ్చిన సైనికుడు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మారింది…

ఇక మహేష్ బాబు కి శ్రీను వైట్ల కూడా దూకుడు సినిమా తో భారీ హిట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఒక్కసారిగా తార స్థాయి కి వెళ్ళిపోయింది. ఇక ఇలాంటి క్రమంలో వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఆగడు సినిమా తో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు దాంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది…

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరొకసారి మంచి ఫ్యామిలీ సినిమా చేయాలనే ఉత్సాహంతో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కి డేట్స్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆయన బ్రహ్మోత్సవం అనే ఒక డిజాస్టర్ సినిమాని తీసి మహేష్ బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్ తీసిన డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు…

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాతో మంచి విజయాన్ని ఇచ్చాడు. ఇక అదే నమ్మకం తో అతనికి రెండో సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. అప్పుడు త్రివిక్రమ్ ఖలేజా సినిమాతో ప్లాప్ సినిమాని ఇచ్చాడు ఇక ఇప్పుడు వీళ్ళ జంవి లో గుంటూరు కారం సినిమా వచ్చింది ఇది కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుని ముందుకు కదులుతుంది…